/rtv/media/media_files/2026/02/01/telangana-2026-02-01-16-53-35.jpg)
Telangana govt announces Rs 1 crore ex-gratia, job for brother of martyred excise constable Sowmya
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య (25) కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించింది. రూ.కోటి నగదు, ఆమె ఫ్యామిలీలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. విధి నిర్వహణలో సౌమ్య ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. ఆమె కుటుంబానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అలాగే ఎక్సైజ్ విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ఆయుధాలు సమకూర్చుతామని తెలిపారు.
Also Read: SIT విచారణలో KCR ఎమోషనల్..
ఇదిలాఉండగా ఈ ఏడాది జనవరి 23న నిజామాబాద్‌లో అక్రమంగా గంజాయి తలిస్తున్న ముఠాను పట్టుకునేందుకు సౌమ్య యత్నించారు. ప్రాణాలను లెక్కచేయకుండా వాళ్లని అదుపులోకి తీసుకునేందుకు పోరాడారు. కానీ అక్రమ రవాణాదారులు ఆమెను వాహనంతో ఢీకొట్టారు. సౌమ్యకు తీవ్రంగా గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా అక్కడ ఆమె చికిత్స తీసుకుంటూ శనివారం రాత్రి ప్రాణాలు కోల్పోయింది.
Also Read: 15 ఏళ్లలోపు పిల్లలకు ఇక స్కూళ్లలోనే, పూర్తి ఉచితంగా.. సర్కార్ కీలక నిర్ణయం
Follow Us