Ind-Pak War: ఎయిర్ పోర్టులు, జనావాసాలే లక్ష్యంగా దాడులు

పాకిస్తాన్ మళ్ళీ దాడులకు తెగబడుతోంది. సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లతో దాడులు చేస్తోంది. అది కూడా ఎయిర్ పోర్ట్ లు, జనావాసాలే లక్ష్యంగా అటాక్ చేస్తోంది. జైపూర్ ఎయిర్ పోర్ట్ లో పేలుడు శబ్దాలు వినిపించాయి. అయితే బ్లాక్ అవుట్ కారణంగా వివరాలు ఇంకా తెలియలేదు. 

New Update
pak

pakistan Drones Attacking On Air Ports

దెబ్బలు మీద దెబ్బలు పడుతున్నా...పాకిస్తాన్ సైన్యం తన బుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. ఒకవైపు యుద్ధం వలన ప్రాణాలు పోతున్నాయి. ఆర్థికంగా నష్టపోతోంది. అయినా కూడా ఇంకా దాడులకు తెగబడుతూనే ఉంది. పూర్తిగా తుడిచి పెట్టుకుపోయే వరకూ పాక్ కు మన:శాంతి లభించదు కాబోలు. ఈరోజు మళ్ళీ పాక్ సైన్యం అటాక్ మొదలెట్టింది. ఎయిర్ పోర్టులు, ప్రజల ఇళ్ళ మీద దాడులు చేస్తోంది. సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లతో దాడులు చేస్తోంది. కొంత సేపటి క్రితం రాజస్థాన్ లోని జైపూర్ విమానాశ్రయంలో పేలుడు శబ్దాలు వినిపించాయని వార్తా కథనాలు వస్తున్నాయి. అయితే బ్లాక్ అవుట్ కారణంగా అక్కడ ఏం జరుగుతోందో తెలియడం లేదని చెప్పాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

Also Read :  Operation Sindoor : ఆపరేషన్‌ సిందూర్‌ ఎఫెక్ట్‌ : కర్రెగుట్టలో ఆపరేషన్‌ కగార్‌కు బ్రేక్‌..

Also Read :  PIB Fact Check: బుద్ది మార్చుకోని పాక్.. భారత మహిళా పైలెట్ పట్టుబడ్డారంటూ ఫేక్ న్యూస్!

చీకటి పడగానే రెచ్చిపోతోంది..

భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో మళ్లీ దాడులు మొదలయ్యాయి. చీకటి పడటంతో సరిహద్దుల్లో పాక్ కాల్పులకు పాల్పడుతోంది. జమ్మూ, సాంబా, పఠాన్‌కోట్‌, ఫిరోజ్‌పూర్‌,యూరీ, కుప్వారా, పూంఛ్ ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులకు యత్నిస్తోంది. దీంతో యాక్టివ్‌లో ఉన్న భారత ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్ వాటిని కూల్చేసింది. జమ్మూకశ్మీర్, పంజాబ్‌, రాజస్థాన్, గుజారాత్‌లో అధికారులు హై అలెర్ట్‌ ప్రకటించారు. పలు ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. బ్లాక్‌అవుట్ కూడా విధించారు. ప్రజందరూ ఇళ్లల్లోనే ఉండాలని సూచనలు చేశారు. మళ్లీ 7 ప్రాంతాల్లో పాకిస్తాన్ సెకండ్ అటాక్‌కు యత్నించింది. జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా దీనిపై ట్వీట్ చేశారు. తనకు కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయన్నారు.  

Also Read :  IND-PAK WAR: పాక్ దాడులను తిప్పికొట్టాం.. ఆర్మీ సంచలన ప్రెస్ మీట్!

Also Read :  Ind-Pak War: పీఎం మోదీ ఇంటికి ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్..పాక్ అణు కుట్రపై చర్చ?

today-latest-news-in-telugu | india pakistan war 2025 | latest-telugu-news | breaking news in telugu | telugu-news | national news in Telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు