/rtv/media/media_files/2025/07/30/dharmasthala-1-2025-07-30-10-54-56.jpg)
1. ఆలయం అభివృద్ధి చెందిన సమయం (1950 – 1994)
ఈ సమయంలో ధర్మస్థల ఆలయం వేగంగా విస్తరించింది. అన్నదానం, ఉచిత చికిత్స లాంటి కార్యక్రమాలతో భక్తులు భారీగా తరలివచ్చారు. శివరాత్రి, దీపావళి లాంటి పండగ రోజుల సమయంలో వారానికి 20,000 మంది భక్తులు వచ్చేవారన్న చర్చ ఉంది. అయితే.. ఆ సమయంలోనూ మిస్సింగ్ కేసులు, అనుమానాస్పద మరణాలు జరిగాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
దశమిస్సింగ్ కేసులుఅనుమానాస్పద మరణాలు
1970–79812
1980–893146
1990–9497108
భక్తుల సంఖ్య ప్రతీ ఏటా పెరుగుతున్న.. తప్పిపోయిన వారిని గుర్తించి వారిని కుటుంబ సభ్యులకు అప్పగించే వ్యవస్థ లేదన్న చర్చ మొదటి నుంచి ఇక్కడ ఉందని తెలుస్తోంది.
Also Read : నిత్యపెళ్లికూతురు.. 8 పెళ్లిళ్లు చేసుకుంది.. 9వ సారి...
2. ఈ సమయంలోనే అనుమానాస్పద మరణాలు (1995 – 2014)
1995లో ఒక డాలిత్ శానిటేషన్ కార్మికుడు ధర్మస్థలలో శుభ్రపరిచే పనికి చేరాడు. ఆ సమయంలోనే భారీగా మరణాలు చోటు చేసుకున్నాయని ఆయన చెబుతున్నారు. ఈయన ఫిర్యాదుతోనే ఇప్పుడు ధర్మస్థల నిజాలు నిగ్గు తేల్చడానికి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఆ సిట్ ఆధ్వర్యంలోనే తవ్వకాలు జరుగుతున్నాయి. డాలిత్ మాటల్లో.. “నేను 1995 నుంచి 2014 వరకు వందల మృతదేహాలు పూడ్చాను. అందులో మహిళలవి, స్కూల్ యూనిఫాం వేసుకున్న పిల్లలవి కూడా ఉన్నాయి”
ఈ దశలో చోటుచేసుకున్న ప్రధాన సంఘటనలు:
* 2003: ఎంబీబీఎస్ విద్యార్థిని అనన్య భట్ టూర్‌లో అదృశ్యం అయ్యింది.
* 2012 అక్టోబర్ 10: 17 ఏళ్ల సౌజన్య హత్య, అత్యాచారం జరిగింది. నిందితుడు ఎవరనేది నిర్ధారణ కాలేదు.
కాలంమిస్సింగ్ కేసులుమహిళలు
1995–995456 %
2000–0411261 %
2005–0913763 %
2010–1411358 %
అయితే.. ధర్మస్థలలో మిస్సింగ్, మరణాలను నిగ్గు తేల్చాలని అనేక మంది ఆ సమయంలో ఆందోళనలు చేశారు. ఆందోళన కారులు చెబుతున్న లెక్కల ప్రకారం 1980 నుంచి 2014 వరకు 416 మిస్సింగ్, 463 అనుమానాస్పద మరణాలు చోటు చేసుకున్నాయి.
3. ఈ ఏడాది ఏం జరిగిందంటే?
1. 22 జూన్ 2025 – బెంగళూరు న్యాయవాదులు ఓజస్వి గౌడ, సచిన్ దేశ్‌పాండేను శానిటేషన్ కార్మికుడు సంప్రదించాడు. తన హయాంలో అఘాయిత్యాలు, హత్యలు జరిగాయని చెప్పాడు. తాను శవాలను పూడ్చిన ప్రదేశాలు చూపిస్తానని తెలిపాడు.
2. 3 జూలై – జిల్లా ఎస్పీకి రాతపూర్వక ఫిర్యాదు, ఫొటో ఆధారాలు సమర్పించాడు.
3. 4 జూలై – ధర్మస్థల పోలీస్‌స్టేషన్-లో FIR 39/2025 నమోదు.
4. 19 జూలై – రాష్ట్ర ప్రభుత్వం ప్రనబ్ మోహంతీ నేతృత్వంలో 4-సభ్యుల SIT ఏర్పాటు చేసింది.
5. 28–31 జూలై – 13 గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకం; 6వ ప్రదేశంలో 25 ఎముకలు లభించాయి. ఏటీఎం, పాన్ కార్డులు కూడా లభించాయి.
8. 1 ఆగస్టు – 7వ సైట్ తవ్వకం మొదలైంది.
Also Read : అనిల్ అంబానీకి మరో బిగ్ షాక్.. లుక్ అవుట్ నోటీసులు జారీ
4. అనుమాన్సాద అంశాలు
* 1995–2014 మధ్య మిస్సింగ్ డేటా, అనుమానాస్పద మరణాల సంఖ్య మధ్య సారూప్యత ఉండడం అనుమానాలకు తావిస్తోంది.
* 2015 తరువాత శానిటేషన్ కార్మికుడు పట్టణాన్ని వదిలిపెట్టి వెళ్లగానే అదే సమయంలో మిస్సింగ్ కేసులు ఉన్నట్లుండి తగ్గాయి..
5. 1 ఆగస్టు 2025 నాటికి పరిస్థితి
తవ్విన ప్రదేశాలు: 13లో 7 పూర్తయ్యాయి.
లభించిన ఎముకలు: 25
మిగిలిన పనులు: 6 ప్రదేశాల్లో తవ్వకం
6. ప్రశ్నలు:
మొత్తం చనిపోయిన వారు ఎంత మంది? ఇందులో యాత్రికులు, స్థానికుల సంఖ్య ఎంత?
2012లో సౌజన్య మృతి చెందిన సమయంలో ఆందోళన చేసిన వారు ఇప్పుడు ఎందుకు బయటకు రాలేకపోతున్నారు?
20 ఏళ్లుగా మిస్సింగ్ ఫైళ్లను పట్టించుకోకుండా ఎందుకు వదిలేశారు?
telugu breaking news | telugu-news | buried bodies dharmasthala | dharmasthala burial case | Dharmasthala case updates | latest-telugu-news | national news in Telugu | telugu crime news