/rtv/media/media_files/2025/08/01/anil-ambani-2025-08-01-19-18-36.jpg)
Anil Ambani
అనిల్ ధీరుబాయ్ అంబానీ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానికి మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఈడీ ఆయనకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. అనిల్ అంబానీ రూ. 17 వేల కోట్ల లోన్ ఫ్రాడ్, మనీ లాండరింగ్ కేసులో ఇరక్కున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనకు దీనికి సంబంధించిన ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆగస్టు 5న విచారకు రావాలని ఆదేశాలు ఇచ్చింది. తాజాగా ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. అంటే ఆయన దేశం నుంచి విడిచి వెళ్లేందుకు ఇక అవకాశం ఉండదు. ఆర్థిక నేరాలు లేదా ఇతర తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులో లుక్ అవుట్ నోటీసులు అధికారులు జారీ చేస్తారు.
Also Read: 'బీజేపీ కోసం ఈసీ ఓట్ల చోరీ.. ఆటమ్ బాంబ్ లాంటి ఆధారాలున్నాయ్': రాహుల్ గాంధీ
ఏంటీ ఈ కేసు
ఇక వివరాల్లోకి వెళ్తే అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు వేల కోట్ల విలువైన బ్యాంకు లోన్ మోసానికి పాలడ్డాయనే ఆరోపణలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) కేసు నమోదు చేసింది. గతంలో అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు యెస్ బ్యాంక్ రూ.3 వేల కోట్ల రుణాలు ఇచ్చింది. 2017 నుంచి 2019 మధ్య ఈ డబ్బులు చట్ట వ్యతిరేక పద్ధతులు దారి మళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఆ బ్యాంకుకి చెందిన మాజీ ప్రమోటర్లకు లంచం ఇచ్చినట్లు అభియోగాలు కూడా నమోదయ్యాయి. అంతేకాదు రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్న రూ.10 వేల కోట్ల రుణాలు కూడా దారి మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి.
Also Read: రేపే పీఎం కిసాన్.. ఈ పని చేయకపోతే డబ్బులు రావు.. అన్నదాతలకు అలర్ట్!
అయితే ఆర్‌కమ్ (రిలయన్స్ కమ్యూనికేషన్స్), కెనరా బ్యాంకు మధ్య రూ.1050 కోట్ల రుణం విషయంలో మోసం జరిగినట్లు కూడా ఆరోపణలు రావడంతో దీనిపై ఈడీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అలాగే ఏటీ1 బాండ్లలో రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ ఏకంగా రూ.2850 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టిందని, ఇందులో భాగంగా క్విడ్ ప్రోకోకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. మొత్తంగా అనిల్ అంబానీకి చెందిన కంపెనీలన్నీ కూడా దాదాపు రూ.17 వేల కోట్ల వరకు బ్యాంకు రుణాల మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తోంది.
Also Read: పాక్, బంగ్లాపై ట్రంప్ టారిఫ్ మినహాయింపు.. భారత్‌పై అమెరికా కుట్ర!
ఈ రుణాల ఫ్రాడ్‌కు సంబంధించిన కేసుపై గత వారం ఈడీ అనిల్ అంబానీకి చెందిన వివిధ ఆఫీసుల్లో 3 రోజుల పాటు సోదాలు చేసింది. మొత్తంగా 50 కంపెనీలు, ముంబయిలోని 25 మంది వ్యక్తులకు చెందిన ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా అధికారులు పలు కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 5న ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయంలో విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.