Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా మరో కీలక విషయం విషయం వెలుగులోకి వచ్చింది. ఈ లిక్కర్ పాలసీ వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి రూ.2,026 కోట్ల నష్టం జరిగినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదికలో వెల్లడైంది. ఈ రిపోర్టు లీకైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిప్రకారం చూసుకుంటే ఢిల్లీ మద్యం పాలసీని సరిగ్గా అమలు చేయడంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) విఫలమైనట్లు కాగ్ పేర్కొంది. Also Read: గుండెపోటుతో కుర్చీలోనే.. ఈ చిన్నారి విజువల్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు దీనిపై నిపుణుల కమిటీ సిఫార్సులను అప్పటి డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా నేతృత్వంలో మంత్రుల బృందం విస్మరించిందని చెప్పింది. లిక్కర్ పాలసీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే విషయాల్లో మంత్రిమండలి, లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం కూడా తీసుకోలేదని పేర్కొంది. అలాగే వీటి లైసెన్సుల జారీ, రూల్స్ ఉల్లంఘనలు జరిగినట్లు తెలిపింది. అయితే ఈ వ్యవహారంలో ఫిర్యాదులు ఉన్నా కూడా అన్ని సంస్థలను వేలం వేసేందుకు పర్మిషన్ ఇచ్చారని చెప్పింది. బిడ్డింగ్ వేసిన కంపెనీల ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి పరిశీలనలు జరపలేదని.. చివరికి నష్టాల్లో ఉన్న కంపెనీలకు కూడా బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు ఛాన్స్ ఇచ్చినట్లు కాగ్ తెలిపింది. అంతేకాదు ఆయా సంస్థలకు లైసెన్సులు కూడా పునరుద్ధరించినట్లు చెప్పింది. Also Read: మీ పాన్ కార్డుకి సంబంధించి ఈ మెసేజ్ వచ్చిందా అయితే జాగ్రత్త ఇదిలాఉండగా లిక్కర్ పాలసీ కేసులో మనీశ్ సిసోడియా(Manish Sisodia), మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)ను గతంలో ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితమే ఆప్ నేతలు బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు ఫిబ్రవరి 5న ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎన్నికల వేళ.. లిక్కర్ పాలసీకి సంబంధించి కాగ్ రిపోర్టు బయటపడటం ప్రధాన్యం సంతరించుకుంది. Also Read : సంక్రాంతికి 'రాజా సాబ్' అప్డేట్.. ఏంటో తెలుసా? Also Read : జడేజాకు బిస్కెట్.. నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్!