Delhi Liquor Scam: లిక్కర్ పాలసీతో ఢిల్లీ ప్రభుత్వానికి భారీ నష్టం.. కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు
లిక్కర్ పాలసీ వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి రూ.2,026 కోట్ల నష్టం జరిగినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదికలో వెల్లడైంది. ఈ రిపోర్టు లీకైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఎన్నికల వేళ కాగ్ రిపోర్టు బయటపడటం చర్చనీయాంశమవుతోంది.