RajaSaab: ప్రతీ ఏడాది సంక్రాంతికి మన టాలీవుడ్ నుంచి కొత్త సినిమాల అప్డేట్స్ వరుసపెట్టి వస్తుంటాయి. ముఖ్యంగాస్టార్ హీరోల అభిమానులు పండక్కి కొత్త సినిమాల అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ క్రమంలో ప్రభాస్ నటిస్తున్న 'రాజాసాబ్' అప్డేట్(RajaSaab Update) కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read : జడేజాకు బిస్కెట్.. నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్!
సమ్మర్‌కు రాజాసాబ్(RaajaSaab) లేనట్టే..
మారుతి(Director Maruthi) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. గతంలో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న సమ్మర్ కానుకగా విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే, గ్రాఫిక్స్ పనులు, పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా సినిమా విడుదల వాయిదా పడే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
#TheRajaSaab some percentage of shoot left , not able meet the deadline.
— Nikhil (@Attitudist) January 10, 2025
Next release date discussions are going on .
Film coming out really well 💥💥 pic.twitter.com/VFY6ez8HhF
Also Read : 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్స్.. 'పుష్ప2' కన్నా తక్కువ 'దేవర' కంటే ఎక్కువ
అందుకే ఈ సంక్రాంతికి 'రాజాసాబ్' కొత్త రిలీజ్ డేట్‌ను కొత్త పోస్టర్ రూపంలో ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై మేకర్స్ నుంచి దీనిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం గాయం కారణంగా ప్రభాస్ యూరప్‌లో ఉన్నట్లు సమాచారం. అక్కడే రెస్ట్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే తిరిగి వచ్చి షూటింగ్‌లో పాల్గొననున్నాడు.
Also Read: చంపడంలో పీహెచ్‌డీ.. మర్డర్లలో మాస్టర్స్ చేశా.. డాకు మహారాజ్ ఊరమాస్ రిలీజ్ ట్రైలర్!
మార్చి తొలి వారం నాటికి షూటింగ్ పూర్తి చేసేందుకు చిత్రబృందం కసరత్తు చేస్తోంది. హారర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్,రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.