Heart Attack: ఆ చిన్నారికి 8 ఏళ్ళు. రోజులాగే సంతోషంగా ఆ రోజు కూడా స్కూల్ కి వెళ్ళింది. కానీ అదే తనకు చివరి రోజు అవుతుందని ఊహించలేకపోయింది. కూర్చున్న కుర్చీలోనే కుప్పకూలిపోయింది. గుండెపోటుతో ప్రాణాలు విడిచింది. బిడ్డ మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటన గుజరాత్(Gujrat) లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకుంది.
Also Read: చంపడంలో పీహెచ్‌డీ.. మర్డర్లలో మాస్టర్స్ చేశా.. డాకు మహారాజ్ ఊరమాస్ రిలీజ్ ట్రైలర్!
గుండెపోటుతో 8 ఏళ్ల బాలిక మృతి.
— RTV (@RTVnewsnetwork) January 11, 2025
గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో ఎనిమిదేళ్ల బాలిక గుండెపోటుతో మరణించింది. మూడో తరగతి విద్యార్థిని గార్గి క్లాస్‌కి వెళ్తుండగా అస్వస్థతకు గురైంది.#Gujarat #schoolstudent #Heartattack #RTV pic.twitter.com/NVaMKUeLbC
Also Read: Allu Arjun: నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ కి బిగ్ రిలీఫ్.. ఇకపై ఆ అవసరం లేదు!
3వ తరగతి చిన్నారి..
గుజరాత్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8 ఏళ్ళ ఓ బాలిక 3వ తరగతి చదువుతోంది. అయితే బాలిక తరగతి గదిలోకి వెళ్లేముందు.. లాబీలో ఉన్న కుర్చీలో కూర్చుంది. అలా కూర్చున్న పాప హఠాత్తుగా కుప్పకూలిపోయింది. కాసేపటి తర్వాత ఈ విషయాన్ని గమనించిన అక్కడున్న టీచర్లు, ఇతర విద్యార్థులు పరిగెత్తుకుని వచ్చి పాపను పైకి లేపే ప్రయత్నం చేశారు. వెంటనే ఓ టీచర్ సీపీఆర్ కూడా చేసింది. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆ చిన్నారి గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. 8 ఏళ్ళు చిన్నారి గుండెపోటు(Heart Attack)తో మరణించడం అందరినీ షాక్ కి గురిచేసింది. ఈ ఘటన పై స్కూల్ ప్రిన్సిపాల్ సిన్హా స్పందించారు. ఆ చిన్నారికి ఎలాంటి అనారోగ్య కారణాలు లేవని.. శుక్రవారం ఉదయం పాప కుర్చీలో కూర్చొని ప్రాణాలు విడిచిందని తెలిపారు. అలాగే చిన్నారి తల్లిదండ్రులు ముంబైలో ఉంటున్నట్లు చెప్పారు.
ఇది కూడా చూడండి: తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్ ది సీన్స్! ట్రైలర్ చూశారా
Also Read: Lal Bahadur Shastri లాల్ బహుదర్ శాస్త్రిని చంపిందేవరు..ఇప్పటికీ వీడని మిస్టరీ!