/rtv/media/media_files/2025/02/08/qCBbtAVvDE6s95qNEyTH.jpg)
PM Modi
ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక (Delhi Assembly Elections) ల్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ని బీజేపీ ఓడించింది. దాదాపు 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కాషాయ జెండాను ఎగురవేస్తోంది. అయితే ఈ క్రమంలో సీఎం ప్రమాణ స్వీకారాన్ని కూడా ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. అయితే ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం ఎప్పుడు? ఎవరని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇది కూడా చూడండి: Mahakumbhabhishekam : కాళేశ్వరంలో మహాకుంభాభిషేకం ..42 సంవత్సరాల తర్వాత మరోసారి....
ప్రధాని మోదీ పర్యటన తర్వాతే..
ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం ప్రధాని మోదీ (PM Modi) పర్యటన తర్వాతే అని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధాని నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఫ్రాన్స్, అమెరికాలో పర్యటించనున్నారు. తిరిగి మళ్లీ ఫిబ్రవరి 13 తర్వాతే ఆయన ఇండియాకు వస్తారు. ఆ తర్వాతే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 48 స్థానాలను గెలుచుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కేవలం 22 సీట్లు మాత్రమే గెలుచుకోగా, కాంగ్రెస్ వరుసగా మూడోసారి ఖాతా తెరవలేకపోయింది.
ఇది కూడా చూడండి: Maha Kumbh Mela:కుంభమేళాలో తగ్గని ట్రాఫిక్..300 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
ఇదిలా ఉండగా ఢిల్లీ సీఎం పదవికి అతిషి (Atishi) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్‌కు అందించారు అతిషి. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ సీఎంగా ఉండాలని అతిషిని కోరారు ఎల్జీ. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత అనూహ్యంగా సీఎం అయ్యారు అతిషి. నిన్న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కల్కాజీ స్థానం నుంచి అతిషి ఎమ్మెల్యేగా గెలుపోందారు. ఇక్కడినుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలవడం ఇది రెండోసారి.
ఇది కూడా చూడండి: Cinema: పుష్ప-2 పై తొలిసారి నోరు విప్పిన మెగాస్టార్.. అందరూ కలిసి ఉండాలంటూ.. సెన్సేషనల్ కామెంట్స్!