Cinema: పుష్ప-2 పై తొలిసారి నోరు విప్పిన మెగాస్టార్.. అందరూ కలిసి ఉండాలంటూ.. సెన్సేషనల్ కామెంట్స్!

మాది అందరిదీ ఒకటే కాంపౌండ్...మేమందరం ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళం అని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. పుష్ప 2 సినిమా ఆడితే గర్వపడ్డాను అంటూ మొదటి సారి ఆ సినిమా గురించి నోరు విప్పారు. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరు ఈ వ్యాఖ్యలు చేశారు.  

New Update
cinema

Megastar Chiru At Laila Pre release Evenr

నేను ఈ ఫంక్షన్ కు వస్తున్నప్పుడు విశ్వక్ సేన్ వేరే కాంపౌండ్ కదా అన్నారు. తాను మొదటి నుంచి ఇండస్ట్రీ లో అందరూ కలిసి ఉండేలా కృషి చేస్తూనే ఉన్నాను. ఒక సినిమా ఆడితే వందల మంది బాగుంటారు. పుష్ప 2 సినిమా ఆడితే గర్వపడ్డాను. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులు గా ఉంటారు. ఇండస్ట్రీ అంతా ఒకటే కాంపౌండ్ అంటూ మాట్లాడారు మెగాస్టార్ చిరంజీవి. మొదటిసారి పుష్ప సినిమా గురించి బహిరంగంగా స్పందించారు.  విశ్వక్ సేన్ నటించిన లైలా సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కు చిరు స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. లేడీ గెటప్ లో విశ్వక్ చాలా బాగున్నాడని.. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని చెప్పారు. చాలా మంది  మగాళ్ళు విశ్వక్ కు ఫ్యాన్స్ మారతారని కామెడీ చేశారు చిరు. 

అవును అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నా..

సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాతలుగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నేను నటిస్తాను అంటూ మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు.  ఆ సినిమా సమ్మర్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు. కోదండరామిరెడ్డి తో నాకు ఎలాంటి కెమిస్ట్రీ వుందో అనిల్ రావిపూడి తో అలాంటి అనుబంధం వుందని చిరు చెప్పుకొచ్చారు. అలాగే 30ఇయర్స్ పృథ్వీ గురించి చెప్పే సందర్భంలో ప్రజారాజ్యం జనసేనగా పరివర్తన చెందిందని స్పష్టం చేశారు.

విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైలా. రామ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించనుండడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవరి 14న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. తాజాగా లైలా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. రూల్స్ లేవు, బౌండరీలు లేవు అంటూ నవ్వించడమే ప్రధానంగా సాగే సినిమాగా లైలా రాబోతోంది. 

Also Read: Cricket: రెండో వన్డే, సీరీస్ కూడా భారత్ దే...

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు