Ys Jagan:వైఎస్ జగన్‌ నివాసం, వైసీపీ కార్యాలయం దగ్గర సెక్యూరిటీ..ఏపీ  పోలీసుల కీలక నిర్ణయం!

వైఎస్ జగన్ నివాసం దగ్గర భద్రతకు సంబంధించి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గత బుధవారం జరిగిన ఘటన తర్వాత పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో జగన్ నివాసం దగ్గర ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేశారు.

New Update
tadepalli palace

tadepalli palace

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గుంటూరు జిల్లా తాడేపల్లి నివాసం, పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర పోలీసులు భద్రత కోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తాడేపల్లి జగన్ నివాసం, వైసీపీ కార్యాలయం దగ్గర పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. జగన్‌ నివాసం పక్కనున్న వైసీపీ కార్యాలయం ఎదురుగా ఉన్న గార్డెన్‌లో ఈ నెల 5న గడ్డి తగలబడి మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. 

Also Read:Maha Kumbh Mela:కుంభమేళాలో తగ్గని ట్రాఫిక్‌..300 కిలో మీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌!

సీసీటీవీ ఫుటేజీలను...

దీంతో వైసీపీ నేతలు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు.ఈ మేరకు దర్యాప్తులో భాగంగా వైసీపీ కేంద్ర కార్యాలయం దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజీలను ఇవ్వాలని.. స్థానిక పోలీసులు ఆ కార్యాలయ సిబ్బందిని కోరారు. కానీ వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ క్రమంలో జగన్ నివాసం దగ్గర భద్రత చర్యల్లో భాగంగా పోలీసులు నిఘాను పెంచేందుకు వీటిని ఏర్పాటు చేశారు. 

Also Read:Prashant Bhushan: ఆప్‌ ఓటమిపై స్పందించిన ప్రశాంత్ భూషణ్‌.. కేజ్రీవాల్‌పై విమర్శలు

ఈ మేరకు మొత్తం ఎనిమిది సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. వీటిని తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లోని మానిటర్‌కు కనెక్ట్ చేశారు. వైసీపీ కార్యాలయం ఎదురుగా ఉన్న గార్డెన్‌లో గడ్డి తగలబడి మంటలు చెలరేగిన ఘటనపై విచారణ కూడా జరుగుతోంది. ఇప్పటికే పోలీసులు అ సమీపంలోని.. ఆ మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించి పరిశీలించారు. మంటలు చెలరేగిన ప్రాంతంలోని మట్టి, బూడిద నమూనాలను తాజాగా సేకరించి పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపించారు. ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.

వైఎస్ జగన్ నివాసం దగ్గర గత బుధవారం ఈ అగ్నిప్రమాదం జరిగింది.. వెంటనే అక్కడి భద్రతా సిబ్బంది తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఈ ప్రమాదం అనుమానాస్పదంగా ఉందని వైసీపీ ఆరోపించింది. జగన్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పోలీసులు ఈ ఘటనను తీవ్రంగా తీసుకున్నారు.. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.. ఇప్పుడు సీసీ కెమెరాలను కూడా అమర్చారు.

Also Read: Horoscope Today:నేడు ఈ రాశి వారికి వాయిదా పడ్డ పనులన్నీ పూర్తై పోతాయి!

Also Read: Gaza:గాజాకు కరవు తప్పింది కానీ...!

Advertisment
తాజా కథనాలు