దేశంలోనే కాంగ్రెస్ చెరిగిపోయే రోజు వస్తాది | Laxman | BJP | RTV
అంబటి రాయుడు బీజేపీకి సపోర్ట్గా సంచలన కామెంట్స్ చేశారు. విశాఖలో జరిగిన ఏబీవీపీ సభకి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశం కోసం పని చేసే పార్టీ బీజేపీ ఒక్కటేనంటూ సపోర్ట్ చేశారు. దీంతో అంబటి బీజేపీలోకి చేరనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.
రేపు తెలంగాణకు ప్రధాని మోడీ రానున్నారు. రేపు ఆదిలాబాద్, ఎల్లుండి సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రారంభం, మరికొన్ని అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
అయోధ్యలో రామ మందిర శంకుస్థాపనలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం అయోధ్యకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12.05 గంటలకు ప్రాణప్రతిష్ఠ పూజ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం 12.55 గంటల వరకు కొనసాగనుంది.
ఈ నెల 22న అయోధ్యలో రామ మందిర పున:ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఆరోజు సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు బండి సంజయ్. తద్వారా పవిత్రమైన దైవ కార్యాన్ని ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యేలా చూడాలని కోరారు.
తాను హిందూ వ్యతిరేకి అంటూ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాముడి అక్షింతలతో బీజేపీ రాజకీయం చేస్తుందని ఆరోపించారు. కరీంనగర్ కు ఎంపీ గా ఉన్న బండి సంజయ్ ఈ ఐదేళ్లలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారి చెంప చెళ్లుమనిపించారు పూణే బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కాంబ్లే. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు విమర్శలు గుప్పించారు. దీనిపై ఎమ్మెల్యే వివరణ ఇస్తూ.. తాను ఆ అధికారిని కొట్టలేదని.. కేవలం నెట్టేసినట్లు తెలిపారు.
మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరానికి అడుగుపెడుతున్న వేళ దేశ ప్రజలకు ప్రధాని మోదీ కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలియజేశారు. 2023లో భారత్ ఎన్నో విజయాలను సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. భారత్ స్ఫూర్తిని 2024 లోనూ ఇలాగే కొనసాగించాలని మోదీ అన్నారు.
బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి తనదైన స్ట్లైల్ లో బీఆర్ఎస్ పై సెటైర్లు వేశారు. రాబోయే ఎన్నికల్లో సినిమా చూపించేది ప్రజలైతే.. చూసేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ నేతలన్నారు. అందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉండాలని ఆయన ఎద్దేవా చేశారు.