/rtv/media/media_files/2025/02/09/oZ1iYgncqDIT0sYbbbKi.jpg)
Sri Kaleshwara Muktheswara Temple
Mahakumbhabhishekam : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో మహాకుంభాభిషేకం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తుని తపోవన పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి చేతుల మీదుగా ఈ మహాకుంభాభిషేకం పూజలు ఘనంగా జరిగాయి. ఈ మహా కుంభాభిషేక వేడుకలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికి నేడు మహకుంభాభిషేకం జరగగా.. సద్గురు సచ్చిదానంద సరస్వతి పర్యవేక్షణలో ఉ.10:42 సుముహూర్తంలో కుంభాభిషేక మహోత్సవం ప్రారంభమైందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.
Also Read: ముఖ్యమంత్రి చంద్రబాబు- నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ మధ్య ఆసక్తికర చర్చ ..
ఈ సందర్భంగాప్రధాన ఆలయం, అనుబంధ ఆలయాలు, రాజగోపురం కలశాల సంప్రోక్షణ పూజలు, మహా కుంభాభిషేక పూజలు నిర్వహించారు. మహా కుంభాభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. రాజగోపురాలకు సంప్రోక్షణ పూజలు, కుంభాభిషేకం కన్నులపండువగా జరిగింది. ఈ మహా ఘట్టం కోసం దేవాదాయ, ఇతర శాఖల అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.
Also Read: ఛత్తీస్‌గఢ్‌లో 31 మంది మావోయిస్టులు మృతి.. అమిత్ షా సంచలన ప్రకటన
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికి 42 ఏళ్ల తర్వాత మహాకుంభాభిషేకం జరుగుతోంది. 1982లో చివరిసారిగా కాళేశ్వరుడి కుంభాభిషేకం నిర్వహించారు. నాటి శృంగేరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్యుల ఆధ్వర్యంలో క్రతువును జరిపించారు. ప్రస్తుతం 42 ఏళ్లకు మహాఘట్టం జరుగుతోంది. ఇప్పుడు కూడా శృంగేరి పీఠాధిపతుల ఆశీస్సులతో జరగడం విశేషం.
Also Read: అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో బీఫ్ బిర్యాని..!
ఆంధ్రప్రదేశ్‌లోని తుని తపోవన ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీస్వామి, ఆయన శిష్య బృందం ఆదివారం ఉదయం 10.42 గంటలకు పలు ఆలయాలు, రాజగోపురాలకు సంప్రోక్షణ చేశారు. ప్రారంభ వేడుకగా ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చారణలతో త్రివేణి సంగమ గోదావరికి చేరుకుని.. అక్కడ ఐదు కలశాలతో జలాలు సేకరించి తీసుకొచ్చారు. అనంతరం గోపూజ, గణపతి పూజలతో మహోత్సవ కార్యక్రమాలు మొదలయ్యాయి. రుత్విజులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ 1,108 కలశాలకు పూజలు చేశారు. అటు, కుంభాభిషేకం మహోత్సవాల కోసం కాళేశ్వంర వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. గోదావరి నది వద్ద గజ ఈతగాళ్లను ఉంచారు. ఇక, మహిళలు బట్టలు మార్చుకునేందుకు తాత్కాలిక గదులను ఏర్పాటు చేశారు. భక్తులకు తాగునీరు అందించడానికి చర్యలు తీసుకున్నారు.
Also Read: స్కూల్ డ్రెస్‌లో చెట్టుకు వేలాడుతూ కనిపించిన బాలికల మృతదేహాలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి మహాకుంభాభిషేక మహోత్సవంలో పాల్గొనడం జరిగింది..#Telangana#TelanganaRising#PrajaPrabhutwampic.twitter.com/f007LVpAZj
— Konda Surekha (@iamkondasurekha) February 9, 2025