/rtv/media/media_files/2025/02/08/OpA2jSHafFXqDEZwX8RK.jpg)
Atishi Marlena
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections 2025) ముఖ్యమంత్రి అతిషీ (Atishi) అనూహ్యంగా విజయం సాధించారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆమె మొదట వెనుకంజలో ఉన్నప్పటికీ చివరి రెండు రౌండ్లలో దూసుకెళ్ళారు. బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరిపై చివరి రౌండ్లో అధిక్యంలోకి నిలిచి మొత్తం 3,600 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇదిలా ఉంటే.. ఆమ్ ఆద్మీలో అత్యంత కీలకమైన నేతలు కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్ దారుణంగా ఓటమి పాలైనప్పటికీ అతిషీ విజయం ఆప్ పార్టీకి స్వల్ప ఊరటనిచ్చిందనే చెప్పొచ్చు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత పార్టీని ముందుండి నడిపించిన అతిషీ.. ఎన్నికల ప్రచారంలోనూ తనదైన మార్క్ చూపించారు.
"यहाँ पानी की बहुत बड़ी समस्या थी। कभी पानी मैला आता था, तो कभी बदबूदार। लेकिन जैसे ही आतिशी जी आईं, उन्होंने पानी की लाइन ठीक करवा दी, और अब यहाँ साफ़ और बढ़िया पानी आ रहा है।"
— Office of MLA Kalkaji (@MLA_Kalkaji) February 3, 2025
चाहे गलियों की रिकार्पेटिंग हो, बच्चों के लिए पार्क में बेंचेस लगवाना हो, सीनियर सिटीज़न्स के लिए… pic.twitter.com/T0RzKACNjR
Also Read : కేజ్రీవాల్ ఓటమి .. ఎంపీ స్వాతి మలివాల్ సంచలన పోస్ట్!
క్రౌడ్ ఫండింగ్‌కు భారీ స్పందన..
ఎన్నికల ప్రచారం కోసం ఆతిశీ క్రౌడ్ ఫండింగ్ మొదలుపెట్టగా ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు రూ.40లక్షలు కావాలని, అంత డబ్బు తన వద్ద లేదని విరాళాలు ఇవ్వాలని ప్రజలను కోరారు. ఇందుకోసం ఓ ఆన్‌లైన్ లింక్‌ను విడుదల చేయగా ఒక్క రోజులోనే 443 మంది దాతలు రూ.19.26 లక్షల ఆన్‌లైన్ విరాళాలు పంపించడం గమనార్హం. కాగా ఫండింగ్ రూపంలోనూ అతిషీ ఢిల్లీ ప్రజలకు మరింత దగ్గరయ్యారని చెప్పొచ్చు.
Also Read : రోహిత్ శర్మ ఫామ్‌పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు.. పెద్ద సమస్యే అంటూ!
ఆప్‌కు ఆమె పెద్ద దిక్కు..
ఢిల్లీలో బీజేపీ (BJP) విజయంతో ఆప్ పని అయిపోందని భావిస్తున్నప్పటికీ అతిశీ రూపంలో ఆప్ ఆశలు సజీవంగా కనిపిస్తున్నాయి. అగ్ర నాయకులు ఓడినప్పటకీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అతిషీ బీజేపీ అభ్యర్థిని ఓడించడం ఒక రకంగా ఆప్ పై ప్రజలు పూర్తి నమ్మకం కోల్పోలేదని భావించవచ్చు. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ అరెస్ట్ కాగానే పగ్గాలు చేపట్టిన అతిషీ తనదైన స్టైల్ లో విమర్శకుల నోళ్లు మూయించింది. బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ ధీటుగా సమాధానం ఇచ్చింది. ఇప్పుడు కేజ్రీవాల్, ఆప్ ఓడినా అతిషీ గెలవడంతో ఆమెకే ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం ఉంది. అంతేకాదు అగ్రనాయకుల ఓటమితో ఆప్ పార్టీకీ ఆమె పెద్ద దిక్కుగా, ఆశా కిరణంలా కనిపిస్తోంది.
Also Read : స్థానిక ఎన్నికలకు సై....ప్రభుత్వానికి కలిసొచ్చేనా?
బీజేపీపై యుద్ధం కొనసాగిస్తాం..
విజయం సాధించిన అనంతరం మీడియాతో మాట్లాడిన అతిషీ.. ఢిల్లీకి సేవ చేయడంలో తాము పట్టుదలతో ఉంటామని ప్రమాణం చేశారు. 'నాపై విశ్వాసం చూపినందుకు కల్కాజీ ప్రజలకు ధన్యవాదాలు. 'బాహుబలి'కి వ్యతిరేకంగా పని చేసిన నా బృందానికి నేను అభినందనలు తెలియజేస్తున్నా. ప్రజల ఆదేశాన్ని మేము అంగీకరిస్తున్నాం. నేను గెలిచాను, కానీ ఇది సంబరాలు జరుపుకునే సమయం కాదు. బీజేపీపై యుద్ధం కొనసాగించండి. వారి నియంతృత్వం, గూండాయిజంపై మాపోరాటం కొనసాగుతుంది. ఈ ఎదురుదెబ్బ తర్వాత కూడా ఆప్ ఢిల్లీ, భారతదేశ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటుంది' అని అతిషీ సంచలన కామెంట్స్ చేశారు.
Also Read : ఢిల్లీ ఫలితాలపై కోమటిరెడ్డి రియాక్షన్.. కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్!