ఢిల్లీ ఫలితాలపై కోమటిరెడ్డి రియాక్షన్.. కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్!

తెలంగాణలో మాదిరిగానే ఢిల్లీలోనూ తము తిరిగి విజయం సాధిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సున్నా సీట్లు, బీజేపీకి 8 సీట్లు దక్కేందుకు కృషి చేసిన కేటీఆర్ ను అభినందిస్తున్నానని ఎద్దేవా చేశారు.

New Update
Komatireddy Vs KTR

Komatireddy Vs KTR

ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు అటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాము ఫైటర్స్ అని అన్నారు. తాము యోధులమని అన్నారు. తెలంగాణ మాదిరిగానే తిరిగి పుంజుకుంటామన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మీ సొంత పార్టీకి సున్నా సీట్లు అందించడం, బీజేపీకి రాష్ట్రం నుంచి 8 సీట్లు బహుమతిగా ఇవ్వడం వంటి అద్భుతమైన విజయానికి కేటీఆర్ ను అభినందిస్తున్నానన్నారు. రాష్ట్రంలో బిజెపి ఎదుగుదలకు కారణం మీరేనంటూ కౌంటర్ ఇచ్చారు.

Advertisment
తాజా కథనాలు