Grampanchayat Elections : స్థానిక ఎన్నికలకు సై....ప్రభుత్వానికి కలిసొచ్చేనా?

అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న స్థానిక సంస్థల ఎన్నికలు వీలయినంత తొందరగా నిర్వహించాలని ప్రభుత్వం బావిస్తోంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఢిల్లీ కేంద్రంగా పావులు కదుపుతున్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చారు.

New Update
Grampanchayat-Elections

Grampanchayat-Elections

Grampanchayat Elections :  అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న స్థానిక సంస్థల ఎన్నికలు వీలయినంత తొందరగా నిర్వహించాలని ప్రభుత్వం బావిస్తోంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఢిల్లీ కేంద్రంగా పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా పార్టీ కేంద్ర నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటికే మంతనాలు జరిపిన రేవంత్‌ రెడ్డి ఇప్పటికే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఇస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుల గణనతో పాటు రుణమాఫీ. రైతుభరోసా వంటి కార్యక్రమాలు తమ ప్రభుత్వానికి సానుకూల ఫలితాలనిస్తాయని రేవంత్‌ భావిస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం రేవంత్‌ సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వాదిస్తున్నాయి. 

Also Read: Delhi Elections Live Updates: పుంజుకున్న AAP.. కౌంటింగ్ లో బిగ్ ట్విస్ట్!

ఇక ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడమే తర్వాయి ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘం కూడా సంకేతాలిచ్చింది.అందులో భాగంగా జిల్లాకు పదిమంది చొప్పున మాస్టర్‌ ఆఫ్‌ ట్రైనర్స్‌, స్టేట్ రిసోర్స్‌ పర్సన్‌లను ఎంపిక చేసింది. వారికి మర్రిచెన్నారెడ్డి మానవవనరుల సంస్థలో ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పాల్గొనే అధికారులకు శిక్షణ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. మరోవైపు మండల,జిల్లా పరిషత్‌, పంచాయతీ రిటర్నింగ్‌ అధికారులను ఫిబ్రవరి 10లోపు ఎంపిక చేయాలని ఎన్నికల సంఘం ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. అలాగే ఎంపిక చేసిన అధికారులకు ఫిబ్రవరి 12 లోపు శిక్షణ పూర్తి చేయాలని ఆదేశించింది. అలాగే పోలింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌  పోలింగ్‌ అధికారులకు ఫిబ్రవరి 15 లోపు శిక్షణ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం సూచింది. పోలింగ్ సిబ్బందికి మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్‌తో శిక్షణ పూర్తి చేయాలని తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది.

Also Read: Delhi BJP CM : ఢిల్లీలో అధికారం దిశగా బీజేపీ.. సీఎం అభ్యర్థి అతనే !

ఈ నెల 10న బీసీ రిజర్వేషన్ల పై డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవ్వనుంది. ఆ వెంటనే బీసీ, ఇతర రిజర్వేషన్ల ఖరారు చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేలా కసరత్తు జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఒకే విడతలో మండల, జిల్లా పరిషత్ పోలింగ్ నిర్వహించేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నా యి. రెండు విడతల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అన్ని సజావుగా సాగితే పరీక్షలు పరిగణలోకి తీసుకొని మార్చి 17, 18 లోగా ఎన్నికలు పూర్తి చేయాలని ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి 15 లోగా అవసరమైన అధికారులకు శిక్షణ పూర్తి చేసి మార్చిలో మూడు విడతులుగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి 24, మార్చి 3,10 తేదిల్లో ఎన్నికలు పూర్తిచేసి 17.18 తేదిల్లో రిజల్ట్‌ ఇవ్వాలని ఎన్నికల సంఘం సిద్దమవుతోంది. ఇప్పటికే 570 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓటర్ల జాబితా వెల్లడికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. గ్రామ పంచాయతీ, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. పోలింగ్‌ స్టేషన్ల తుది జాబితా 15న విడుదల కానుంది. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగానే నోటిఫికేషన్‌ ఇవ్వడానికి ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది.

Also Read:ఓటమి దిశగా సీఎం.. ముందంజలో రమేష్ బిదూరి

రేవంత్‌ సర్కార్‌ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, బీసీ కుల గణన పూర్తి చేశామని అది ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేస్తోందని భావిస్తోంది. అయితే వందశాతం రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెబుతుండగా, వందశాతం రుణమాఫీ చేశామని నిరూపిస్తే దేనికైనా రెడీ అని ప్రతిపక్షాలు సవాలు విసురుతున్నాయి. రైతు భరోసా విషయంలోనూ అదే ఒరవడి కనిపిస్తోంది. అసలు ఎవరికీ రైతుభరోసా కాలేదని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని భావిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎన్నికలకు వెళ్లే సాహసం చేస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది.

Also Read: Delhi Election Results 2025: కాంగ్రాట్స్ రాహుల్.. ఢిల్లీ ఫలితాలపై ట్విట్టర్లో కేటీఆర్ సెటైర్లు!

Advertisment
తాజా కథనాలు