/rtv/media/media_files/2026/01/04/monkeys-2026-01-04-15-58-10.jpg)
ఢిల్లీలో ఓ విచిత్ర సమస్య వచ్చింది. అది కూడా ఏకంగా ఎమ్మెల్యేలే భపడుతున్నారు. ప్రజాప్రతినిధులే భయపడితే సామాన్యుల పరిస్థితి ఏంటి? MLA లు చూసి భయపడేది గ్యాంగ్‌స్టర్స్, క్రిమినల్స్‌ను చూసి కాదు. కోతులను(monkeys) చూసి ఎమ్మెల్యేలు భపడుతున్నారు. ఢిల్లీ అసెంబ్లీ(Delhi assembly sessions) పరిసరాల్లో డజన్ల కొద్దీ కోతులు స్వైరవిహారం చేస్తున్నాయి. ఇవి కేవలం బిల్డింగ్ వెలుపల మాత్రమే కాకుండా, లోపలికి కూడా చొరబడి అధికారులను, ప్రజాప్రతినిధులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా కేబుల్ వైర్లను తెంపడం, డిష్ యాంటెన్నాలను ధ్వంసం చేస్తూ ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తున్నాయి. గతంలో 2017లో ఒక కోతి ఏకంగా సభ జరుగుతున్న సమయంలో లోపలికి ప్రవేశించి గందరగోళం సృష్టించిన సంఘటన కూడా ఉంది.
Also Read : ఒలింపిక్స్-2036 గేమ్స్ నిర్వహించేందుకు సిద్ధం.. ప్రధాని మోదీ సంచలన ప్రకటన
Delhi Assembly Plans To Scare Monkeys
ఢిల్లీ విధాన్ సభ ప్రాంగణంలో గత కొంతకాలంగా కోతుల బెడద మళ్లీ తీవ్రతరమైంది. ఈ సమస్యకు పరిష్కారంగా అధికారులు విచిత్ర నిర్ణయం తీసుకున్నారు. కోతులను భయపెట్టి పారద్రోలడానికి మిమిక్రీ ఆర్టిస్లులను(mimicry-row) ప్రభుత్వం నియమించారు. వీరు కొండముచ్చుల్లా (లంగూర్ల) అరిచి కోతులను అసెంబ్లీ ఆవరణలోకి రాకుండా చేయాలి. సాధారణ కోతులను చూసి భయపడతాయి. అయితే, కొండముచ్చులను బంధించి ప్రదర్శించడంపై నిషేధం ఉన్నందున, అధికారులు మిమిక్రీ నిపుణుల సహాయం తీసుకుంటున్నారు. కొండముచ్చుల అరుపులను అచ్చుగుద్దినట్లుగా అనుకరించే ఐదుగురు నిపుణులను నియమించేందుకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) రూ.17.5 లక్షల అంచనాతో టెండర్లను ఆహ్వానించింది.
ఈ నిపుణులు వారపు రోజులలో ఎనిమిది గంటల షిఫ్టుల్లో పనిచేస్తారు. గతంలో లంగూర్ల కట్-అవుట్లను ఏర్పాటు చేసినప్పటికీ, కోతులు వాటికి అలవాటు పడిపోయి, ఇప్పుడు వాటిపైనే కూర్చుని ఆడుకుంటున్నాయని అధికారులు తెలిపారు. అందుకే ఇప్పుడు కొండముచ్చలా శబ్దాల చేస్తూ భయపెట్టాలని డిసైడ్ అయ్యారు. ఈ పని కోసం ఎంపికైన ఏజెన్సీ తన సిబ్బందికి అవసరమైన పరికరాలను అందించాలి. విధుల పట్ల నిర్లక్ష్యం వహించినా లేదా కోతులు పారిపోయేలా సరిగ్గా సౌండ్ చేయలేకపోతే రోజుకు రూ.1,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఈ సిబ్బందికి ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించనున్నారు. ఈ వినూత్న ప్రయత్నం ద్వారా కోతులకు ఎలాంటి హాని తలపెట్టకుండానే, వాటిని అసెంబ్లీ ప్రాంగణం నుండి సురక్షితంగా వెళ్లగొట్టవచ్చని అధికారులు ఆశిస్తున్నారు.
Also Read : రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో అగ్నిప్రమాదం.. వందలాది బైకులు బుగ్గి!
Follow Us