/rtv/media/media_files/2026/01/04/india-is-preparing-to-host-the-2036-olympics-with-full-strength-2026-01-04-18-02-04.jpg)
India is preparing to host the 2036 Olympics with full strength
ఒలింపిక్స్ 2036 క్రీడలకు సంబంధించి ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. ఈ గేమ్స్ నిర్వహించేందుకు భారత్ పూర్తిస్థాయిలో సిద్ధమవుతోందని పేర్కొన్నారు. గత పదేళ్లలో భారత్‌లో ఇంటర్నేషనల్ క్రీడలు నిర్వహించామని తెలిపారు. హాకీ వరల్డ్ కప్, చెస్ టోర్నమెంట్, అండర్ 17 ఫిపా వరల్డ్‌కప్ లాంటి అంతర్జాతీయ వేదికలకు విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చామని చెప్పారు. 2030లో జరిగే కామన్వెల్త్ క్రీడలు కూడా ఇండియాలోనే జరగనున్నాయన్నారు.
Also Read: కోతులకు భయపడుతున్న MLAలు.. అసెంబ్లీలో మిమిక్రీ ఆర్టిస్టుల నియామకం
2036లో ఒలింపిక్ గేమ్స్ నిర్వహించేందుకు భారత్ పూర్తిస్థాయిలో రెడీ అవుతోందని స్పష్టం చేశారు. అంతేకాదు భారత్ అభివృద్ధి గురించి ఆయన వాలీబాల్ గేమ్‌తో పోల్చారు. విజయం ఏ ఒక్కరి వల్ల సాధ్య కాదనే అంశాన్ని ఈ ఆట తెలియజేస్తుందని అన్నారు. ఇందులో ప్రతిఒక్కరికి పాత్ర, బాధ్యత ఉంటుందని అన్నారు.
Also Read: రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో అగ్నిప్రమాదం.. వందలాది బైకులు బుగ్గి!
ఇదిలాఉండగా జనవరి 4 నుంచి 11 వరకు వారణాసిలో జాతీయ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ జరగనుంది. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 58 జట్లకు చెందిన వెయ్యి మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ పోటీల వల్ల వారణాసి నగరం జాతీయ స్థాయిలో క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదిక కానుందని ఈ గేమ్స్ నిర్వహించనున్న నిర్వాహకులు తెలిపారు.
Follow Us