/rtv/media/media_files/2025/02/02/v9bHi98lc7BpbUeLhFIv.jpg)
BJP,AAP, Congress
దేశ రాజధానిలో నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఆప్..ఆ పార్టీని గద్దెదించి 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత తిరిగి ఢిల్లీ పాలనా పగ్గాలు దక్కించుకోవాలన్న కసితో బీజేపీ...ఈ రెండింటిలో దేనిది పైచేయి అవుతుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
Also Read: Horoscope Today:నేడు ఈ రాశి వారికి ఆదాయం పదింతలు అవుతుంది...మీ రాశేనేమో చూసుకోండి మరి!
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారమే వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది.19 కౌంటింగ్‌కేంద్రాల వద్దమొత్తంగా 10 వేల మంది పోలీసులను మూడంచెల్లో మోహరించింది.
Also Read: Trump-America: అమెరికాలోని భారతీయులకు బిగ్ రిలీఫ్.. ఆ ఉత్తర్వులను కొట్టిపారేసిన కోర్టు
ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. తాజా ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ వైపు మొగ్గు కనిపించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్నాయి.ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కనీస మెజార్టీ 36.స్థానికంగా ఈనెల 5 న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 60.54 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
దాదాపు 50 సీట్లు గెలుస్తామని...
ఢిల్లీలో ప్రధానంగా ఆప్, బీజేపీ మధ్య ముఖాముఖి పోరు నెలకొంది.ఆ రెండు పార్టీలూ విజయం పై వేటికవే ధీమాగా ఉన్నాయి. తాము దాదాపు 50 సీట్లు గెలుస్తామని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ శుక్రవారం పేర్కొన్నారు. దేశరాజధానిలో కేజ్రీవాల్ పార్టీ అధిపత్యానికి తెరపడినట్ఏనన్నారు.
మరోవైపు-ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కొట్టిపోరేస్తున్న ఆప్..తాము అధికారంలో కొనసాగడం ఖాయమని చెబుతోంది. ఆ పార్టీ జాతీయ కన్వీనర్,ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం తమ పార్టీ తరుఫున తాజా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో భేటీ అయ్యారు.
ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లాంఛనమేనని చెప్పారు.మరోవైపు గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఢిల్లీలో శూన్యహస్తాలతో వెనుదిరిగిన కాంగ్రెస్ పార్టీ..ఈసారి పరువు నిలబెట్టుకోవాలని ఆరాటపడుతోంది. 2013 వరకు వరుసగా 15 ఏళ్లపాటు ఢిల్లీని కాంగ్రెస్ పాలించింది.
Also Read: AP: ముఖ్యమంత్రి చంద్రబాబు- నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ మధ్య ఆసక్తికర చర్చ ..