Vande Bharat Express: వందే భారత్‌లో ప్రయాణించేవారికి గుడ్‌న్యూస్.. రైల్వేబోర్టు కీలక నిర్ణయం

వందే భారత్ రైళ్లలో ప్రయాణించేవారి కోసం భారతీయ రైల్వే కొత్త సదుపాయన్ని తీసుకొచ్చింది. అందులో ప్రయాణించే ఏ ప్రయాణికుడైనా టికెట్ బుకింగ్ చేసుకునేటప్పుడు ఫుడ్ ఆప్షన్ ఎంచుకోకపోయినా.. ప్రయాణం చేసేటప్పుడు వాటిని కొనుగోలు చేసేలా అవకాశం కల్పించింది.

New Update
vande bharat express

vande bharat express

వందే భారత్ రైళ్ల (Vande Bharat Express) లో ప్రయాణించేవారి కోసం భారతీయ రైల్వే (Indian Railways) కొత్త సదుపాయన్ని తీసుకొచ్చింది. ఇకనుంచి అందులో ప్రయాణించే ఏ ప్రయాణికుడైనా టికెట్ బుకింగ్ చేసుకునేటప్పుడు ఫుడ్ ఆప్షన్ ఎంచుకోకపోయినా.. ప్రయాణం చేసేటప్పుడు వాటిని కొనుగోలు చేసేలా అవకాశం కల్పించింది. ఆహారం అందుబాటులో ఉన్నదాన్ని బట్టి సిబ్బంది ఆహారం అందిస్తారని రైల్వే బోర్డు శుక్రవారం ప్రకటన చేసింది. దీనికి సంబంధించి ఐఆర్‌సీటీసీకి లేఖ రాసింది.  

Also Read: పాక్‌ ముష్కరుల చొరబాటు భగ్నం.. ఏడుగురిని మట్టుబెట్టిన భారత సైన్యం

Vande Bharat Express - Buy Food Onboard

అయితే వందేభారత్ ట్రైన్‌లో టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మీల్స్ అనేది ఆప్షనల్‌గా చూపిస్తుంది. కొందరు వేరే ఆహారాన్ని చూసుకోవచ్చనే ఉద్దేశంతో ఫుడ్ ఆప్షన్‌ను స్కిప్ చేస్తుంటారు. అయితే ఒక్కోసారి ఇలా చేసుకోకపోవడం వల్ల రైళ్లో డబ్బులు ఇచ్చి కొందామన్నా కూడా ఆహారం ఇచ్చేందుకు సిబ్బంది నిరాకరిస్తున్నారు. డబ్బులు ఇస్తామన్నా కూడా ఇవ్వడం లేదు. దీంతో ఐర్‌సీటీసీ (IRCTC) కి దీనిపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. 

Also Read: కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించిన పాకిస్థాన్ హిందువులు

ఈ నేపథ్యంలోనే తాజాగా రైల్వేబోర్డు కొత్త సదుపాయాన్ని కల్పించింది. అంతేకాదు రైళ్లలో ప్రయాణికులకు అందించే ఆహారం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కూడా ఐఆర్‌సీటీసీకి సూచనలు చేసిది. అలాగే ప్రయాణికులకు అసౌకర్యం ఉండకుండా రాత్రి 9 తర్వాత ట్రాలీల రూపంలో విక్రయాలు చేయకూడదని చెప్పింది. తాజాగా రైల్వేబోర్డు తీసుకున్న ఈ నిర్ణయాన్ని రైల్వే ప్రయాణికులు స్వాగతిస్తున్నారు. 

Also Read: అమెరికా ఐరన్ డోమ్ సిస్టమ్‌ అభివృద్ధిలో మేమూ భాగస్వాములవుతాం: కెనడా

Also Read: మనుషులా మానవ మృగాలా.. రన్నింగ్ ట్రైన్లో 4 నెలల గర్భిణిని ఇద్దరు కీచకులు.. ఛీ ఛీ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు