/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-01T094512.156.jpg)
Horoscope
మేష రాశి వారికి ఈ రోజు చాలా బాగుంది. మంచి అవకాశం నేడు మీ ఇంటి తలుపు తట్టవచ్చు. అన్ని రంగాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. ఆదాయం పదింతలు పెరుగుతుంది. భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేస్తారు. వ్యాపారంలో గొప్ప అవకాశాలు అందుకునే అవకాశాలున్నాయి.
Also Read: Trump-America: అమెరికాలోని భారతీయులకు బిగ్ రిలీఫ్.. ఆ ఉత్తర్వులను కొట్టిపారేసిన కోర్టు
వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. వృత్తి వ్యాపారాలలో పరిస్థితులు అంచనా వేయడంలో విశ్లేషణాత్మక నైపుణ్యం అవసరమవుతుంది. పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకోవడంలో విజయం అందుకుంటారు. గతం తాలూకు చేదు జ్ఞాపకాలు బాధపెడతాయి.
మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి. ఇతరులకు మీ పై దురభిప్రాయం కలిగేలా ప్రవర్తించవద్దు. వృత్తి ఉద్యోగావ్యాపారాలలో కఠినమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఎట్టి పరిస్థితుల్లో మనోధైర్యాన్ని కోల్పోకండి. సన్నిహితుల సహకారంతో క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడే సూచనలున్నాయి.
కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలలో ప్రతికూల పరిస్థితి ఉన్నప్పటికీ మీ కృషి, కఠిన శ్రమ కారణంగా మంచి ఫలితాలు అందుకోనున్నారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. ఆరోగ్యం అంతగా సహకరించకపోవచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఇతరుల సహకారంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. అధిక పనిభారం కారణంగా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. కుటుంబ కలహాల కారణంగా ఈ రోజంతా చిరాకుగా అనిపిస్తుంటుంది. జాగ్రత్తగా వ్యవహరించాలి.
కన్యా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. సందర్భానుసారం నడుచుకుంటే మేలు. ఆర్ధిక పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి.
ముందుకు సాగితే విజయం..
తులా రాశి వారు ఈ రోజు అధిక పని వత్తిడి వల్ల మానసిక ఆందోళనకు గురవుతారు. మిత్రుల సహాయంతో ఆటంకాలను అధిగమిస్తారు. మనోబలంతో ముందుకు సాగితే విజయం సాధిస్తారు. ఒక వార్త విచారం కలిగిస్తుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఏర్పడతాయి.
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తీవ్రమైన పని ఒత్తిడి ఉన్నప్పటికి మెరుగైన ఆర్ధిక ప్రయోజనాలు ఉండడంతో సంతోషంగా ఉండగలుగుతారు. పెండింగ్ పనులపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలకు సంబంధించి మీ ప్రతిపాదనలు ఆమోదం పొందుతాయి.
ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో అన్నింటా ముందుంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతులు రాబోతున్నాయి. ఉన్నతాధికారులు సహకరిస్తారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి.
మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తినిపుణులు, వ్యాపారులకు ఈ రోజు అనుకూలమైన రోజు. సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడుపుతారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. సన్నిహితుల సూచనలు పాటించడం ఉత్తమం.
కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగవ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కీలమైన నిర్ణయాల విషయంలో తెలివిగా వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తగదు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.
మీన రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కొత్త వ్యక్తులను కలుస్తారు. వృత్తి పరంగా సామాజిక పరిధి పెరుగుతుంది. ఉద్యోగంలో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఆదాయవ్యయాలు సరిసమానంగా ఉంటాయి. కొన్ని సంఘటనలు నిరుత్సాహం కలిగించవచ్చు.
Also Read:Iron Dome: అమెరికా ఐరన్ డోమ్ సిస్టమ్ అభివృద్ధిలో మేమూ భాగస్వాములవుతాం: కెనడా
Also Read: Sonu Sood Arrest Warrant: అరెస్టు వారెంట్‌పై సోనూ సూద్ సంచలన ప్రకటన..!