మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై వివాదం..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ మధ్య వివాదం తలెత్తింది. ఆయన స్మారకార్థం ఢిల్లీలో ఓ స్థలాన్ని కేటాయించాలని కేంద్రాన్ని కాంగ్రెస్ కోరింది. కానీ కేంద్రం స్పందించకపోవడంతో కాంగ్రెస్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.