చైనా మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమయ్యింది. ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యు్త్ డ్యామ్‌ను నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. త్రీగోర్జెస్ డ్యామ్ కంటే మూడు రెట్లు ఎక్కువగా ఈ డ్యామ్‌ను నిర్మించేందుకు అక్కడి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారత్ సరిహద్దుకు సమీపంలోని టిబెట్ ప్రాంతంలో ఈ డ్యామ్‌ను నిర్మించనుంది. మొత్తం 137 బిలియన్ డాలర్ల వ్యయంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్‌ఫ్రా ప్రాజెక్టుగా ఈ డ్యామ్ నిలుస్తుందని అక్కడి అధికారులు చెబుతున్నారు
అయితే దీనికి సంబంధించి చైనా పవర్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ 2020లోనే ఓ కీలక విషయం బయటపెట్టింది. ఈ ప్రాజెక్టు విద్యుదుత్పత్తి సామర్థ్యం 300 బిలియన్ కిలోవాట్ అవర్స్‌గా అంచనా వేసింది. ప్రస్తుతం చైనాలో అతిపెద్ద త్రీగోర్జెన్ డ్యామ్ సామర్థ్యం 88.2 బిలియన్ కిలోవాట్ అవర్స్‌గా ఉంది. కానీ కొత్తగా చేపట్టబోయే డ్యామ్ సామర్థ్యం దీనికి మూడు రేట్లు అధికం. వాస్తవానికి హిమాలయాల్లోని బ్రహ్మపుత్ర నది యూటర్న్ అరుణాచల్‌ప్రదేశ్, అసోం గుండా బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తుంది.
Also Read: హార్ట్ సర్జరీ అయ్యాక మన్మోహన్ సింగ్ అన్న మాటలు ఇవే..
యూటర్న్ తీసుకునే ప్రాంతలో ఉన్న భారీ లోయ వద్దే చైనా కొత్త డ్యామ్‌ను నిర్మించనుంది. జలవిద్యుత్పత్తి కోసం బ్రహ్మపుత్ర నదిలో సగం నీటి దారి మళ్లించేందుకు 20 కి.మీ పొడవైన సొరంగాలను నాలుగు నుంచి ఆరు వరకు తవ్వాలని చైనా పవర్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ అంచనా వేసినట్లు స్థానిక మీడియా చెప్పింది. నమ్‌చా బార్వా కొండల్లో తవ్వబోయే ఈ సొరంగాల ద్వారా సెకనుకు 2 వేల క్యూబిక్ మీటర్ల నీరు ప్రవహిస్తుందని పేర్కొంది. ఈ ప్రాజెక్టు కేవలం జలవిద్యుత్తు డ్యామ్ మాత్రమే కాదని.. పర్యావరణానికి, చైనా జాతీయ భద్రతకు అలాగే ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు సంబంధించిన ప్రాజెక్టని చైనా పవర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ గత ఛైర్మన్ యాన్ జియాంగ్ తెలిపారు.
టిబెట్‌లో పుట్టిన బ్రహ్మపుత్ర నది భారత్ నుంచి బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తోంది. అయితే ఈ నదీ జలాల ప్రవాహం, పంపిణీకి సంబంధించిన వివిధ అంశాలపై భారత్-చైనా మధ్య ఒప్పందం జరిగింది. వర్షాకాలంలో ఈ నదికి ఎక్కువగా వరదలు వస్తుంటాయి. ఇరుదేశాల మధ్య ఒప్పంద ప్రకారం మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు బ్రహ్మపుత్ర నీటిని రెండు దేశాలు పంచుకోవాల్సి ఉంది. వరదలొచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు నది పరిస్థితి గురించి దానికి దిగువనున్న దేశాలకు చెప్పాలి. కానీ చైనా,భారత్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు వచ్చాక ఈ సమాచారాన్ని చైనా సరిగా అందించడం లేదు.
2002లో తొలిసారిగా బ్రహ్మపుత్ర నది జలాలపై భారత్-చైనా మధ్య ఒప్పందం జరిగింది. ఆ తర్వాత 2008,2013,2018లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేశారు. 2023లో చివరిసారిగా ఒప్పందం జరిగింది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో ఇప్పటిదాకా కొత్త ఒప్పందం ఇంకా జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చైనా భారీ డ్యామ్‌ను నిర్మించేందుకు సిద్ధం కావడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: ముంబై పేలుళ్ల సూత్రధారి.. అబ్దుల్ రెహ్మాన్ మక్కి కన్నుమూత
ఈ ప్రాజెక్టు ఏర్పాటైతే బ్రహ్మపుత్ర నీటిపై చైనా నియంత్రణ పెరుగుతుంది. ఎండకాలంలో తమవైపు నీటిని మళ్లించుకునే ఛాన్స్ వస్తుంది. దీనివల్ల మనదేశంలో అసోం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు వర్షకాలంలో బ్రహ్మపుత్ర నదిలో భారీగా వరద ఉంటుంది. ఒకవేళ ఒకేసారి ఎక్కువగా నీటిని విడుదల చేస్తే దిగువనున్న ప్రాంతాలు జలమయమవుతాయి. ఈ ప్రాజెక్టు భారత్-చైనా సరిహద్దుకు కేవలం 30 కి.మీ దూరంలోనే ఉంది.
ఒకవేళ ఇరుదేశాల మధ్య యుద్ధ పరిస్థితులు వస్తే.. ప్రాజెక్టులో నిల్వ చేసిన నీటిని చైనా ఒకేసారి విడుదల చేసి వాటర్ బాంబ్‌గా వినియోగించే ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల అసోం, అరుణాచల్‌ప్రదేశ్ వంటి ఈశాన్య రాష్టాలు ముంపునకు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇరుదేశాల మధ్య ప్రవహించే నదులకు సంబంధించి వివిధ అంశాలపై సీమాంతర సహకారం, పరస్పర సమాచార మార్పిడి చేసుకోవాలని డిసెంబర్ 18న జరిగిన భారత్-చైనా ప్రత్యేక ప్రతినిధుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విదేశాంగశాఖ వెల్లడించింది. అయితే టిబెట్‌ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు వస్తుంటాయని.. ఇలాంటి ప్రాంతంలో భారీ డ్యామ్‌ను కట్టడం ప్రమాదమేనని చెప్పింది.