/rtv/media/media_files/2025/03/21/hOadt8Vg5V14QxIgtLCB.jpg)
CM Revanth
దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ప్రారంభమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ.ఈరోజు ఈ దేశంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇతర అన్ని రాజకీయ పార్టీలు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాతే ప్రారంభమయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన Annual Legal Convlave లో పాల్గన్న రేవంత్ రెడ్డి మాట్లాడారు.ఈ దేశంలో దళితులు, ఆదివాసులకు రిజర్వేషన్లు కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీనే.. ఇతర రాజకీయ పార్టీలు ఎన్నికలొస్తే పోటీ చేయడం, గెలిస్తే పదవిలో కూర్చోవడం, ఓడిపోతే ఇంట్లో కూర్చోవడం అలవాటైపోయిందన్నారు.బీజేపీ నుంచి మొదలుకొని చాలా విపక్ష పార్టీలు ఇలాగే వ్యవహరిస్తున్నాయని రేవంత్ అన్నారు. ఓడిపోయాక ప్రజల మధ్యకు రావడం లేదు…. గెలిచినప్పుడే కనిపిస్తున్నారన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం నిత్యం ప్రజల మధ్య ఉండి, ప్రజల కోసం పని చేసే రాజకీయ పార్టీగా నిలుస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు..
ఈ రోజు ప్రధాని మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు రద్దు చేయాలనే ప్రయత్నం చేస్తోందని రేవంత్ ఆరోపించారు.. గత 11 ఏళ్లుగా సామాజిక న్యాయం గురించి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించలేదు. అటువంటి సమయంలో, డిపార్ట్‌మెంట్ ఛైర్మన్ డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ నేతృత్వంలో, దేశానికి ముందువైపు దారి చూపించేలా, సామాజిక న్యాయం కోసం మేము కార్యాచరణతో ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నామని రేవంత్ అన్నారు. కొందరు బీజేపీ నాయకులు తరచూ మాట్లాడుతుంటారు. "కాంగ్రెస్ పార్టీ చేసిందేమిటి?" అని. నేను ఈ బీజేపీ నాయకులకు గుర్తు చేయాలనుకుంటున్నా…కాంగ్రెస్ పార్టీ పోరాటం ద్వారానే 41 కోట్ల భారతీయుల స్వాతంత్ర్యం సిద్ధించిందని సీఎం గుర్తు చేశారు. దేశం ఒకప్పుడు ఉగ్రవాద ప్రమాదాల్లో చిక్కినప్పుడు, పక్కనున్న పాకిస్తాన్ నుండి ముప్పు వచ్చినప్పుడు, ఇందిరా గాంధీ ధైర్యంగా యుద్ధాన్ని ప్రకటించారు.పాకిస్తాన్‌ను ఓడించి, ఆ దేశాన్ని రెండు భాగాలుగా విడదీసి, ఆ యుద్ధాన్ని జయించి, కాళీమాత గౌరవాన్ని నిలబెట్టారని రేవంత్ అన్నారు.
Also Read: భారత్‌పై 25 శాతం సుంకాలు.. ఈ ఎగుమతులపై తీవ్రంగా ప్రభావం
Revanth Reddy About Congress Party
ఈ దేశం కోసం మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీప్రాణత్యాగం చేశారన్నారు.ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రోజు, ప్రధాని పదవిని చేపట్టాలని అందరూ కోరినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ ఆ పదవిని తిరస్కరించారు. ప్రధాని పదవిని త్యాగం చేసి ఆర్థిక నిపుణుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ను భారత ప్రధాని చేయడం ద్వారా ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా భారత్ ఎదగడంలో సహకారం అందించారన్నారు.తర్వాత రాష్ట్రపతి పదవిని చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ, శ్రీమతి సోనియా గాంధీ గారు దాన్నీ తిరస్కరించారని గుర్తు చేశారు.
గత ఎన్నో సంవత్సరాలుగా రాహుల్ గాంధీ దేశంలోని పేదల కోసం, వెనుకబడినవారి కోసం, దళితుల కోసం, ఆదివాసుల కోసం, ఒబీసీల కోసం, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతున్నారు.కానీ మోదీ గారు మాత్రం తన పదవిని వదిలి కొత్తవారికి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా లేరు. పార్టీ లీడర్‌ను ఎంపిక చేసినా, మోదీ గారు షరతులు పెట్టి మొత్తం తన నియంత్రణలో ఉండాలని భావిస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు దాటకుండా తగిన గుణపాఠం చెప్పే బాధ్యతను మేము తీసుకుంటాం. రాహుల్ గాంధీ నాయకత్వంలో మోదీని ఓడించేందుకు, దేశాన్ని రక్షించేందుకు, రాజ్యాంగాన్ని కాపాడేందుకు, రిజర్వేషన్లను అమలు చేసేందుకు, సామాజిక న్యాయాన్ని స్థాపించేందుకు కాంగ్రెస్ కుటుంబం మొత్తం సిద్ధంగా ఉందన్నారు. ఓబీసీలకు సామాజిక న్యాయం అందించడానికి, ఈ దేశంలో జనగణన (కుల గణన) చేపట్టే రోజులు వస్తున్నాయి. బీసీలకు వారి జనాభా నిష్పత్తి మేరకు రిజర్వేషన్లు కల్పించేలా కొత్త చట్టాన్ని రూపొందించడానికి, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశం ముందుకు సాగుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read: 10 నిమిషాల్లో లక్షల కోట్ల నష్టం.. ట్రంప్ టారిఫ్‌తో కుప్పకూలిన స్టాక్ మార్కెట్!
Rahul Gandhi | cm-revanth-reddy | dellhi | congress-party | latest-telugu-news | telugu-news | national news in Telugu