Stock Market: 10 నిమిషాల్లో లక్షల కోట్ల నష్టం.. ట్రంప్‌ టారిఫ్‌‌తో కుప్పకూలిన స్టాక్ మార్కెట్!

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మన సూచీలు నష్టాల బాట పట్టాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై 25శాతం సుంకాలు విధించడంతో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది.

New Update
stock market losses

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. మార్కెట్ ప్రారంభమైన వెంటనే పెట్టుబడిదారులకు పెద్ద షాక్ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్లలోని మన సూచీలు నష్టాల బాట పట్టాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై 25శాతం సుంకాలు విధించడంతో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. రెండు రోజులుగా లాభాల్లో నడుస్తున్న స్టాక్స్ ఆవిరవుతున్నాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 535 పాయింట్ల నష్టంతో 80,946 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 157 పాయింట్లు క్షీణించి 24,696 వద్ద ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.66 వద్ద ఉంది. 

Also Read :  ఫోన్ పే, గూగుల్ పే వాడే వారు ఇవి పక్కా తెలుసుకోవాల్సిందే!

ఉదయం 9:20 గంటల నాటికి BSE సెన్సెక్స్ 604 పాయింట్లు లేదా 0.74% తగ్గి 81,668కి చేరుకోగా, నిఫ్టీ 50 183 పాయింట్లు లేదా 0.73% తగ్గి 24,668 వద్ద ఉంది. భారతీయ ఈక్విటీలు భారీగా అమ్ముడుపోవడంతో, BSE లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.5 లక్షల కోట్లు తగ్గి రూ.453.35 లక్షల కోట్లకు చేరుకుంది. 

ట్రేడింగ్ ప్రారంభమైన10 నిమిషాల్లోనే, BSEలో లిస్ట్ చేయబడిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.452 లక్షల కోట్ల నుంచి రూ.449 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే, దాదాపు రూ.3 లక్షల కోట్ల విలువైన మూలధనం కొన్ని నిమిషాల్లోనే పోయింది. మార్కెట్‌లో ఈ పతనం పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను కూడా ప్రభావితం చేసింది. 

షేర్లు ఇలా..

నిఫ్టీ సూచీలో జియో ఫైనాన్షియల్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు రాణిస్తున్నాయి. రిలయన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, డాక్టర్ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, కోల్ ఇండియా స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. బుధవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడింగ్‌ను ముగించగా.. నేడు ఆసియా మార్కెట్లు అదే బాటలో పయనిస్తుంటాయి. మార్కెట్ అస్థిరతను కొలిచే విక్స్ సూచిక 3.13 శాతం నష్టాల్లో కొనసాగుతోంది. అమెరికా సుంకాల ప్రకటన, ఆంక్షలు ఇందుకు దోహదం చేస్తున్నాయి.

Also Read :  ‘పేదల బైక్’.. లీటర్‌కు 70 కి.మీ మైలేజ్ - ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు సామీ!

sensex-today | Stock Market Losses Today | Stock Market Today | indian-stock-market | stock-market-crash | stock-market-news

Advertisment
తాజా కథనాలు