Trump: భారత్‌పై 25 శాతం సుంకాలు.. ఈ ఎగుమతులపై తీవ్రంగా ప్రభావం

భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్ 25 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలపై అనిశ్చితి నెలకొంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుంది.

New Update
Trump's 25% tariff, penalty on India may cost economy over 30 billion Dollars, experts warn

Trump's 25% tariff, penalty on India may cost economy over 30 billion Dollars, experts warn

భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్ 25 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అలాగే జరిమానాలు కూడా ఉంటాయన్నారు. దీంతో భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలపై అనిశ్చితి నెలకొంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. భారత జీడీపై 0.2 శాతం నుంచి 0.5 శాతం అంటే దాదాపు రూ.2.60 లక్షల కోట్ల (30 బిలియన్ డాలర్లు) వరకు ప్రభావం పడనుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండోనేషియా, వియత్నాం లాంటి దేశాల కన్నా కూడా భారత్‌పైనే ఎక్కువగా పన్నులు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. 

Also Read: 10 నిమిషాల్లో లక్షల కోట్ల నష్టం.. ట్రంప్‌ టారిఫ్‌‌తో కుప్పకూలిన స్టాక్ మార్కెట్!

ఈ రంగాలపై ప్రభావం

భారత్‌ నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే అన్నిరకాల వస్తువులపై 25 శాతం సుంకాల విధింపులతో మన దేశంలోని పలు రంగాలపై ప్రభావం పడనుంది. ముఖ్యంగా అల్యూమినియం, ఉక్కు, వెహికిల్స్‌ విడిభాగాలు, రొయ్యలు, రత్నాభరణాలు, జౌళి, స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌తో పాటు ఆహార ఉత్పత్తులపై ప్రభావం పడనుంది. మనదేశం నుంచి అమెరికాకు 10 బిలియన్ డాలర్ల వరకు రత్నాభరణాలను ఎగుమతి చేస్తారు. అలాగే సముద్ర ఆహార ఉత్పత్తులైన రొయ్యలు వంటి వాటిపై తీవ్రంగా ప్రభావం ఉండనుంది. ఈ విషయాన్ని ఆర్థిక వేత్త అశోక్‌ గులాటి తెలిపారు. అంతేకాదు భారత్-బ్రిటన్‌ మధ్య జౌళి పరిశ్రమల ఒప్పందం కుదిరింది. దీనివల్ల వల్లే వచ్చే ప్రయోజనాలు అమెరికా టారిఫ్‌ వల్ల ప్రభావితం అవుతాయని పేర్కొన్నారు. 

అమెరికా ఇండోనేషియాపై ప్రస్తుతం 20 శాతం సుంకాలు కొనసాగిస్తోంది. అలాగే వియత్నాంపై 19 శాతం టారిఫ్‌ విధించింది. భారత్‌ కన్నా తక్కువ సుంకాలు ఉండే దేశాల నుంచి భారత ఎగుమతులకు పోటీ ఉండవచ్చని ఫిక్కీ అధ్యక్షుడు హర్షవర్ధన్ అగర్వాల్ చెప్పారు. అలాగే ప్రతికూల పరిస్థితులు ఎదురుకావొచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం రష్యా నుంచి భారత్‌ మిలటరీ సామాగ్రీ, క్రూడ్‌ ఆయిల్ కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే సుంకాలపై అదనంగా జరిమానా విధిస్తానని ట్రంప్‌ ప్రకటించారు. దీంతో ఆయా రంగాల్లోని కంపెనీల్లో ప్రతికూల ప్రభావం ఉంటుందని ఫియో డైరెక్టర్‌ జనరల్ అజయ్ సహాయ్ అన్నారు. అమెరికా వాణిజ్యం ఒప్పందం కదిరితే అనిశ్చితి తొలగిపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.   

Also Read: ఊరు మొత్తాన్ని భయపెట్టారు కదరా.. పావురాల కేసు కనిపెట్టిన పోలీసులకు రివార్డ్

మరోవైపు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 2025-26లో చూస్తే ఏప్రిల్-జూన్‌ త్రైమాసికంలో భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి దేశంగా అమెరికా ఉంది. తొలి త్రైమాసికంలో మన ఎగుమతులు 22.18 శాతం పెరిగి 25.51 బిలియన్ డాలర్లకు చేరాయి. అలాగే దిగుమతులు 11.68 శాతం పెరిగి 12.86 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 2024లో అమెరికాకు ఎక్కువగా ఔషధ ఫార్ములేషన్‌లు ఎగుమతి అయ్యాయి. వాటి విలువ 8.1 డాలర్లుగా ఉంది. ఇక టెలికాం వస్తువులు 6.5 బిలియన్ డాలర్లు, పెట్రోలియం ఉత్పత్తులు 4.1 బిలియన్ డాలర్లు, వాహన విడిభాగాలు 2.8 బిలియన్ డాలర్లు, రత్నాలు 5.3 బిలియన్ డాలర్లు, బంగారం ఇతర ఆభరణాలు 3.2 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అలాగే ఇనుము, ఉక్కు, రెడిమేడ్‌ దుస్తులు చూసుకుంటే 5.5 బిలియన్ డాలర్లుగా ఉంది. 

Advertisment
తాజా కథనాలు