/rtv/media/media_files/2025/05/05/sKEEm4pUKhPgsc5pykoN.jpg)
colour bomb explodes on brides
పెళ్లి వేడుక కోసం చేసిన ఒక స్టంట్ విషాదంగా మారింది. ఓ జంట తమ పెళ్లి రిషప్షన్ వేడుకను ఎంతో గ్రాండ్‌గా అంగరంగ వైభవంగా చేసుకోవాలని అనుకున్నారు. దీంతో కలర్ కలర్ పొగ బాంబులతో వెడ్డింగ్ షూట్ ప్రారంభించారు. ఆ వెడ్డింగ్ షూట్‌లో అనుకోని ఘోర ప్రమాదం జరిగింది. బాంబు నేరుగా వధువుపై పేలడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం
పెళ్లి కాస్త విషాదం
బెంగళూరులో భారత-కెనడియన్ జంట కలల వివాహం విషాదకరంగా మారింది. ఈ జంట తమ పెళ్లి, రిషప్షన్ వేడుకను ఎంతో గ్రాండ్‌గా ఏర్పాటు చేసుకుంది. ఇందులో భాగంగానే పెళ్లి - రిసెప్షన్ మధ్య వెడ్డింగ్ ఫోటో సెషన్ పెట్టుకున్నారు. కలర్ కలర్ పొగ బాంబులతో అందమైన క్షణాలను వీక్షించాలనుకున్నారు. అందమైన కలర్ -బాంబులను బ్యాక్‌గ్రౌండ్‌లో పేల్చి ఒక అద్భుతమైన షాట్ తీయాలని ప్లాన్ చేశారు.
Also Read : కాలేజ్ కుర్రాళ్ల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్!
Also Read: ప్రతీకారం తీర్చుకుంటాం.. ఉగ్రవాదులను చంపుతాం : అమిత్ షా సంచలన కామెంట్స్!
వధువును పైకి లేపి ఉండగా.. అప్పుడే వెనుక నుంచి పొగ బాంబు పేలింది. అందులో ఒక కలర్ బాంబు వధువుపైకి దూసుకొచ్చింది. దీంతో ఆ వధువు తీవ్ర గాయాలపాలైంది. ఆ జంట వారి జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు అని భావించిన రోజే దురదృష్టవశాత్తూ ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో వధువుకు తీవ్రగాయాలయ్యాయి. ఆమె నడుము బాగా కాలిపోయింది. అలాగే ఆమె శరీరంలోని ఇతర భాగాలపై చిన్న చిన్న కాలిన గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం తర్వాత వధువు మంచం మీద పడుకుని ఉన్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Also Read : దేశంలోని మొట్టమొదటి AI- ఆధారిత డేటా సెంటర్ పార్క్
viral-video | viral-news | latest-telugu-news | telugu-news | wedding