/rtv/media/media_files/2025/08/20/amit-shah-2025-08-20-15-26-44.jpg)
Amit Shah
కేంద్రప్రభుత్వం పార్లమెంటులో మూడు కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు(Online Gaming Bill), జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లు (ప్రజాప్రతినిధుల ఉద్వాసన బిల్లు)ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) ప్రవేశపెట్టారు. ఈ మూడు బిల్లులను విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా రాజ్యాంగ సవరణ బిల్లును తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ బిల్లు ప్రకారం ఏదైనా అవినీతి, అక్రమాలు, క్రిమినల్ కేసుల్లో 30 రోజుల పాటు జైల్లో ఉండే ప్రజాప్రతినిధులకు వారి పదవి రద్దు అవుతుంది. తీవ్ర నేరారోపణలతో అరెస్టయి జైలుకు వెళ్లే ప్రజాప్రతినిధుల పదవులు రద్దు చేసేలా ఈ బిల్లును తీసుకొచ్చారు.
Chaos In Parliament As Amit Shah Tables Bills
ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రధానమంత్రి, ఎంపీలకు ఈ బిల్లు వర్తిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. కనీసం అయిదేళ్ల పాటు శిక్ష పడే నేరం చేసి, అరెస్టయి, 30 రోజులు జైల్లో ఉంటే 31వ రోజునే వారి పదవి పోతుంది. వాళ్లంతట వారు రాజీనామా చేయకపోయినా కూడా కొత్త రూల్స్ ప్రకారం తమ పదవిని కోల్పోతారు. అయితే అమిత్ షా గుజరాత్ హోంమంత్రిగా ఉన్నప్పుడు అరెస్టు అయ్యారంటూ విపక్ష ఎంపీలు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఆ సమయంలో నన్ను తప్పుడు ఆరోపణలతో అరెస్టు చేసినప్పటికీ నైతికంగా తన పదవికి రాజీనామా చేశానంటూ విపక్ష నేతలకు కౌంటర్ ఇచ్చారు.
Also Read: సీఎం రేఖా గుప్తాపై దాడి చేసింది కుక్కల ప్రేమికుడే.. పక్కా ప్లాన్‌తో దాడి చేశాడా?
VIDEO | Parliament Monsoon Session: Union Home Minister Amit Shah (@AmitShah) tables the Constitution (130th Amendment) Bill, 2025, the Government of Union Territories (Amendment) Bill, 2025, and the Jammu and Kashmir Reorganisation (Amendment) Bill, 2025 in Lok Sabha.… pic.twitter.com/AB8NBhPj3C
— Press Trust of India (@PTI_News) August 20, 2025
Also Read: టీచర్‌ని లవ్ చేసిన స్టూడెంట్.. ఆ కోపంతో పెట్రోల్ పోసి నిప్పంటించాడు
ఈ బిల్లు క్రూరమైందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) అన్నారు. అన్యాయంగా సీఎంలను, మంత్రులను అరెస్టు చేసే పరిస్థితి ఏంటని ధ్వజమెత్తారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. మరోవైపు విపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించడాన్ని మరో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్(Shashi Tharoor) ఖండించారు. ఇది ఇంగిత జ్ఞానానికి సంబంధించిన విషయమని.. ఈ బిల్లులో ఎలాంటి తప్పు తనకు కనిపించడం లేదని పేర్కొన్నారు. ఇది మన ప్రజాస్వామ్యానికి ఎంతో మేలు చేస్తుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ బిల్లును మరింత పరిశీలించేందుకు సెలక్ట్ కమటీకి పంపించే ఛాన్స్ ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.