/rtv/media/media_files/2025/02/05/XNwXJVwsVUFWKXh24xCd.jpg)
Chat gpt and Deepssek
Chat GPT and DeepSeek: 2022 నవంబర్‌లో వచ్చిన చాట్ జీపీటీ ఏఐ రంగంలో సంచలనం తెలిసిందే. ఇటీవల చైనా(China)కి చెందిన డీప్‌సీక్ కూడా ఈ రంగాన్ని మరింత కుదిపేసింది. దీనిదెబ్బకు అమెరికా స్టా్క్‌మార్కెట్లు(Stock Market)1 ట్రిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. ప్రస్తుతం చాట్‌జీపీ, డీప్‌సీక్, మైక్రోసాఫ్ట్(Microsoft)కు చెందిన కో పైలట్ లాంటి ఏఐ చాట్‌బోట్‌ల వాడకం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులను చాట్ జీపీటీ, డీప్‌సీక్ లాంటి ఏఐ చాట్‌బోట్‌లకు(AI Chat Bots) దూరంగా ఉండాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
Also Read: కుల గణన సర్వేపై నెక్స్ట్ స్టెప్ ఇదే.. మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన!
ప్రభుత్వ సమాచార గోప్యతకు వీటి నుంచి ఏదైనా ముప్పు రావొచ్చని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు తమ ఉద్యోగాలకు ఆర్థికశాఖ దీనిపై అల్టిమేటం కూడా ఇచ్చినట్లు పలు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. ఆర్థికశాఖ అంతర్గతంగా విడుదల చేసిన ఈ అడ్వైజరీ వాస్తవమేనని.. ఈ వారమే దీన్ని విడుదల చేసినట్లు ఆర్థికశాఖ అధికారులు కూడా చెప్పారు.
Also Read: అమెరికా నుంచి అక్రమ వలసదారులు ఔట్.. అమృత్‌సర్‌లో ల్యాండ్ అయిన విమానం
కేవలం భారత్ మాత్రమే కాదు..
అయితే మిగతా మంత్రిత్వశాఖలకు కూడా ఇలాంటి ఆదేశాలు జారీచేశారో, లేదో తెలియాల్సి ఉంది. కేవలం భారత్ మాత్రమే కాదు.. ఇటలీ(Italy), ఆస్ట్రేలియా(Australia) వంటి దేశాలు కూడా డీప్‌సీక్‌పై ఇలాంటి ఆంక్షలే విధించాయి. ఈ దేశాలు కూడా తమ ప్రభుత్వ డేటాకు ఇలాంటి ఏఐ టూల్స్(AI Tools) వల్ల ముప్పు వాటిల్లొచ్చనే ఆందోళనతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇదిలాఉండగా.. చాట్‌జీపీ, డీపసీక్.. ఇవి రెండూ కూడా ఐఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లకు(Android Phones) అందుబాటులో ఉన్నాయి. మరోవైపు మన ఇండియా నుంచి కూడా సొంత ఏఐ మోడల్(AI Model)ను ఈ ఏడాదిలోనే ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవలే వెల్లడించారు.