TG Caste Census: కుల గణన సర్వేపై నెక్స్ట్ స్టెప్ ఇదే.. మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన!
సర్వేపై అపోహలు, అనుమానాలు ఉన్న కుల సంఘాల నేతలను పిలిచి.. చర్చించి నివృత్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. కుల గణన సర్వే నివేదిక ఆధారంగా సంక్షేమ పథకాల రూపకల్పన చేస్తామన్నారు. పబ్లిక్ డొమైన్ లో కులాల వారిగా, ఉప కులాల వివరాలను పెడతామన్నారు.
TG Caste Census: కులగణన సర్వేపై కొందరు అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) ఆరోపించారు. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కుల గణన సర్వే ఎలా జరిగింది అనేది ప్లానింగ్ డిపార్ట్ మెంట్ వివరిస్తుందన్నారు. స్వాతంత్ర్యం తర్వాత ఇంత శాస్త్రీయంగా, లాజికల్ గా దేశంలోని ఏ రాష్ట్రంలో కుల గణన జరగలేదన్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ ఉండవద్దని ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు వివరణ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అన్ని కులాలకు సంబంధించిన సామాజిక ఆర్థిక సర్వే జరిగిందన్నారు.
2011 జనాభా లెక్కల ఆధారంగానే ఎస్సీ వర్గీకరణ(TG SC Categorisation)..
సర్వే పై ప్రజలెవరికీ అపోహలు అవసరం లేదన్నారు. చాలా మంది సమగ్ర కుటుంబ సర్వే తో పోల్చుకున్నారన్నారు. అది పబ్లిక్ డొమైన్ లో లేని డాక్యుమెంట్ అని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కూడా 2011 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని చేసిందేనన్నారు. వ్యక్తిగత వివరాలు కాకుండా.. రేపు ఎల్లుండి లోగా పబ్లిక్ డొమైన్ లో కులాల వారిగా, ఉప కులాల వివరాలను జిల్లాల వారీగా పెడతామన్నారు. సర్వేపై అపోహలు, అనుమానాలు ఉన్న కుల సంఘాల నేతలను పిలిచి.. చర్చించి నివృత్తి చేస్తామన్నారు. కుల గణన సర్వే నివేదిక ఆధారంగా సంక్షేమ పథకాల రూపకల్పన చేస్తామన్నారు.

Uttam Kumar Reddy

Also Read: బెజవాడలో రెచ్చిపోయిన బ్లేడ్ బ్యాచ్.. బైక్పై వెళ్తున్న వారి గొంతులు కోసి..!
Also Read: మహాకుంభమేళాకు చేరుకున్న మోదీ... త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం
2011 జనాభా లెక్కల ఆధారంగానే ఎస్సీ వర్గీకరణ(TG SC Categorisation)..
సర్వే పై ప్రజలెవరికీ అపోహలు అవసరం లేదన్నారు. చాలా మంది సమగ్ర కుటుంబ సర్వే తో పోల్చుకున్నారన్నారు. అది పబ్లిక్ డొమైన్ లో లేని డాక్యుమెంట్ అని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కూడా 2011 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని చేసిందేనన్నారు. వ్యక్తిగత వివరాలు కాకుండా.. రేపు ఎల్లుండి లోగా పబ్లిక్ డొమైన్ లో కులాల వారిగా, ఉప కులాల వివరాలను జిల్లాల వారీగా పెడతామన్నారు. సర్వేపై అపోహలు, అనుమానాలు ఉన్న కుల సంఘాల నేతలను పిలిచి.. చర్చించి నివృత్తి చేస్తామన్నారు. కుల గణన సర్వే నివేదిక ఆధారంగా సంక్షేమ పథకాల రూపకల్పన చేస్తామన్నారు.
Also Read: ప్రముఖ వ్యాపారవేత్త పింకీ రెడ్డి ఫోన్ హ్యాక్! రిప్లై ఇవ్వదంటూ పోస్ట్
Also Read: పాపం పెళ్లై మూడు నెలలు కూడా కాలేదు..ఎంతకు తెగించార్రా!