Kumbh Mela 2025: మహాకుంభమేళాకు చేరుకున్న మోదీ... త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం

ప్రధాని మోదీ ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు చేరుకున్నారు. అరైల్ ఘాట్ నుంచి సంగమం ఘాట్ కు పడవలో వెళ్లారు. అనంతరం త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. యూపీ సీఎం యోగి మోదీకి ఘన స్వాగతం పలికారు.

New Update
modi at kumbha mela

modi at kumbha mela

Kumbh Mela 2025:  భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు చేరుకున్నారు. ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయానికి చేరుకున్న మోదీ అక్కడి అరైల్ ఘాట్ కు వెళ్లారు. అరైల్ ఘాట్ నుంచి సంగమం వరకు పడవలో చేరుకున్నారు. మోదీతో పాటు యూపీ సీఎం యోగి కూడా ఉన్నారు. అనంతరం మోదీ త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. కాషాయ వస్త్రాలు, రుద్రాక్ష మాల ధరించి స్నానం ఆచరించారు.  హిందూ సంప్రదాయంలో అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన భీష్మాష్టమి(బుధవారం)  రోజున మోదీ కుంభమేళాను సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. 

Also Read: Siddhu: ఐదేళ్ల తర్వాత సిద్దూ మూవీ థియేటర్స్ లో.. ఆ స్పెషల్ డే రోజు రిలీజ్ ?

37.50 కోట్లకు పైగా.. 

జనవరి 13న ప్రారంభమైన అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం  మహాకుంభమేళాలో ఇప్పటివరకు 14 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. అలాగే పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా కుంభమేళాను సందర్శించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పలువురు నాయకులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు.  వీరితో పాటుగా అనేక దేశాల ప్రతినిధులు కూడా స్నానం ఆచరించారు. ఫిబ్రవరి 26తో మహాకుంభమేళా ముగియనుంది.   మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నాటికి మహా కుంభమేళాలో 54 లక్షలకు పైగా భక్తులు స్నానమాచరించారు.ఇప్పటివరకు మొత్తం 37.50 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించినట్లు  యూపీ ప్రభుత్వం తెలిపింది.

Also Read: Thandel Movie:  కెరీర్ లో హయ్యస్ట్ రెమ్యునరేషన్.. తండేల్ కోసం చై, పల్లవి ఎంత తీసుకున్నారంటే!

Advertisment
Advertisment
Advertisment