Jubilee Hills By Pole : జూబ్లీహిల్స్ బై పోల్ పై ఈసీ మరో కీలక నిర్ణయం..నోడల్ అధికారుల నియామకం

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ మృతితో ఇక్కడ ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఉప ఎన్నికకు ఈసీ కసరత్తు వేగవంతం చేస్తోంది. తాజాగా ఎన్నికల నిర్వహణ కోసం నోడల్ అధికారులను నియమించింది.

New Update
Voter List

Jubilee Hills By Pole

Jubilee Hills By Pole : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ మృతితో ఇక్కడ ఎన్నికలు అనివార్యమయ్యాయి. బీఆర్‌ఎస్‌కు సిట్టింగ్‌ స్థానం కావడంతో ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అటు అధికారంలో ఉన్నాం కనుక తమకు విజయం నల్లేరుమీద నడక అని కాంగ్రెస్‌ భావిస్తోంది. దీంతో ఈ ఎన్నిక హీట్‌ పుట్టిస్తోంది. ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతుండగా ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు వేగవంతం చేస్తోంది. అందులో భాగంగా ఎన్నికల నిర్వహణ కోసం తాజాగా నోడల్ అధికారులను నియమించింది. ఈసీ ఆదేశాల మేరకు హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్‌ ఆర్.వి కర్ణన్ నోడల్‌ అధికారులను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.  

ఇది కూడా చదవండి:అయ్యోపాపం.. డబ్బుల కోసం రిటైర్డ్ డీఎస్పీని కట్టేసి కొట్టిన భార్యపిల్లలు..వీడియో వైరల్‌

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సిబ్బంది నియామకం కోసం ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతిని నోడల్ అధికారిగా నియమించిది ఈసీ. అలాగే ఈవీఎం, వివిప్యాట్ నిర్వహణ కోసం కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌవన్ ను, ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా సి.టి.ఓ శ్రీనివాస్ ను, ట్రైనింగ్ అధికారిగా ఎల్‌.బి.నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ ను, మెటీరియల్ మేనేజ్మెంట్ బాధ్యతలు అడ్మిన్ అదనపు కమిషనర్ కె. వేణుగోపాల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

 ఎంసీసీ నోడల్అధికారిగా అదనపు ఎస్పీ (విజిలెన్స్)ఎం. సుదర్శన్, లా అండ్ ఆర్డర్, వల్నరబుల్ మ్యాపింగ్, డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ ప్లాన్ బాధ్యతలు డీఎస్పీ నరసింహా రెడ్డి, ఎక్స్పెండిచర్ మానిటరింగ్ బాధ్యతలు అడిషనల్ కమిషనర్ (ఫినాన్స్) జీహెచ్ఎంసీ బి గీతా రాధికకు అప్పగించారు. ఎన్నికల పరిశీలకులుగా అసిస్టెంట్ వెటర్నరీ అధికారి విల్సన్, డమ్మీ బ్యాలెట్ పేపర్ నోడల్ అధికారిగా సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవి కిరణ్, మీడియా కమ్యూనికేషన్, ఎంసీఎంసీ అధికారిగా సీపీఆర్‌ఓ సెక్షన్ పీఆర్‌ఓ ఎం.దశరథ్ ను నియమించారు. సైబర్ సెక్యూరిటీ, ఐటి, కంప్యూటరైజేషన్ నోడల్ అధికారిగా ఐటి జాయింట్ కమిషనర్ సి.రాధా, హెల్ప్‌లైన్, కంప్లైంట్ రీడ్రెస్సల్ అధికారిగా ఐటి ఏఈ కార్తీక్ కిరణ్, వెబ్‌కాస్టింగ్ అధికారిగా ఐటి ఏఈ తిరుమల కుమార్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

మరోవైపు పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్‌పై ఎవైనా  అభ్యంతరాలు ఉంటే ఈ నెల 26వ తేదిలోగా సమర్పించాలని ఆర్.వి. కర్ణన్ రాజకీయ పార్టీలను కోరారు. ఇవాళ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పెషల్ సమ్మరీ రివిజన్ ప్రక్రియలో భాగంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు ఉన్న 320 పోలింగ్ స్టేషన్ల స్థానంలో 408 పోలింగ్ స్టేషన్లు ప్రతిపాదించామని తెలిపారు. గతంలో 132 ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం 139 ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నామని వివరించారు. అదనంగా 79 కొత్త పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని కర్ణన్‌ వెల్లడించారు.

ఇది కూడా చూడండి:Crime News : ప్రేమపేరుతో దగ్గరై..పెళ్లి చేసుకుని దూరమై..యువతి ప్రాణం తీసిన లవ్‌స్టోరీ

Advertisment
తాజా కథనాలు