/rtv/media/media_files/2026/02/02/fotojet-21-2026-02-02-16-57-54.jpg)
Boy eats momos with gold jewellery worth Rs. 85 lakhs
Momos For Jewellery : చిరుతిండి మోమోలు అంటే 7వ తరగతి చదువుతున్న ఓ బాలుడికి చాలా ఇష్టం. ప్రతిరోజూ బడికెళ్లేటప్పుడు తిని వెళ్లేవాడు.ఈ విషయం గుర్తించిన మోమోస్ అమ్మే వ్యాపారులు.. అతడి నుంచి డబ్బులు కొట్టేయాలని ఓ ప్లాన్ వేశాడు. డబ్బులు తీసుకువస్తే మోమోస్ ఇస్తానని మభ్యపెట్టాడు. అయితే అతనివద్ద డబ్బులు లేవని చెప్పడంతో ఇంట్లోని బంగారు నగలు(gold) తెచ్చి ఇస్తే మోమోలు ఉచితంగా ఇస్తామని ప్రలోభపెట్టారు. అది విన్న బాలుడు ఏమాత్రం ఆలోచించకుండా.. ఇంట్లోని బీరువాలో ఉన్న నగల్లో.. రోజుకొకటి తెస్తూ వ్యాపారికి ఇస్తూ మోమోస్ తినేవాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.85 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను బాలుడు వ్యాపారికి అప్పగించాడు. ఈ విషయం తెలుసుకున్న బాలుడి కుటుంబం షాక్ అయ్యింది. - Uttar Pradesh crime
Also Read : 4 AM బిర్యానీ తింటున్నారా? అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే...
Boy Eats Momos With Gold Jewellery
ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో ఈ సంఘటన జరిగింది. విమ్లేష్ మిశ్రా వారణాసిలో ఒక ఆలయ పూజారి. ఆయన కుమారుడు 7వ తరగతి చదువుతున్నాడు. కాగా, ఆ బాలుడికి మోమో(fry-momos)లంటే చాలా ఇష్టం. మోమోలు అమ్మే వ్యాపారులు ఆ బాలుడ్ని మెల్లగా ట్రాప్ చేశారు. ఇంట్లోని బంగారు ఆభరణాలు తెచ్చి ఇస్తే ఉచితంగా మోమోలు ఇస్తామని ఆశపెట్టారు. దీంతో ఆ బాలుడు కొంత కాలంగా ఇంట్లోని నగలు తెచ్చి వారికి ఇవ్వసాగాడు. ఉచితంగా మోమోలు తింటున్నాడు. మరోవైపు విమ్లేష్ మిశ్రా సోదరి ఇటీవల వారి ఇంటికి వచ్చింది. తన నగలు ఇవ్వాలని ఆమె అడిగింది. దీంతో ఆ కుటుంబం బీరువా తెరిచి చూడగా రూ.85 లక్షల విలువైన బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయి. ఏమయ్యాయని బాలుడ్ని ఆరాతీస్తే మోమో వ్యాపారులకు నగలు ఇచ్చి వాటిని తిన్నట్లు చెప్పాడు. షాక్ తిన్న కుటుంబ సభ్యులు ముగ్గురు మోమో వ్యాపారులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం రూ. 85 లక్షల విలువ చేసే ఆ నగలను రికవరీ చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కేవలం కొన్ని రూపాయల విలువ చేసే మోమోల కోసం ఇంతటి ఖరీదైన ఆభరణాలను తీసుకోవడం చట్టరీత్యా నేరమని పోలీసులు పేర్కొన్నారు.
Also Read : లోక్‌సభలో సరిహద్దు వివాదంపై రగడ.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..
Follow Us