/rtv/media/media_files/2026/02/02/rahul-gandhi-2026-02-02-15-51-38.jpg)
Rahul Gandhi Raises Ladakh Stand-Off In Lok Sabha
ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ సరిహద్దు వివాదంపై చేసిన వ్యాఖ్యలు గందరగోళం రేపాయి. భారత సరిహద్దుల్లోకి చైనా సైన్యం చొరబడుతోందని ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నవరణే తన పుస్తకంలో రాశారు. వీటికి సంబంధించిన అంశాలు ఓ మ్యాగజైన్ ప్రచూరించగా.. దీని గురించి రాహుల్‌గాంధీ లోక్‌సభలో మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు.
Also Read: తెలంగాణకు నిరాశ మిగిల్చిన కేంద్ర బడ్జెట్..రాష్ట్ర ప్రాజెక్టులకు నిధులు నిల్
రాహుల్ గాంధీ చెబుతున్న ఆ పుస్తకం ఇంకా పబ్లిష్ కాలేదని అన్నారు. ప్రచురితం కాని బుక్‌లోని అంశాల గురించి లోక్‌సభలో ఎలా మాట్లాడుతారంటూ రాజ్‌నాథ్ సింగ్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం తలెత్తడంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడంది. సభను అవమానించేలా మాట్లాడతున్నారని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన స్పీకర్ ఓం బిర్లా.. వార్తాపత్రికల క్లిప్పింగులు, ప్రచురణ కాని పుస్తకాలపై సభలో ప్రస్తావించకూడదని అన్నారు.
Also Read: పాక్ ఆడకుంటే రూ.4,500 కోట్లు నష్టం.. పాకిస్థాన్ నిర్ణయంతో ICCకి షాక్!
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై మాట్లాడాలంటూ రాహుల్ గాంధీకి సూచనలు చేశారు. రాహుల్ గాంధీ సభలో మాట్లాడుతుండగా మైక్ కట్ చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సభా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడటంతో లోక్‌సభను మధ్యాహ్నం 4 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటన చేశారు.
VIDEO | In Lok Sabha, Rahul Gandhi raises ex-army chief's memoirs to attack govt on China border issue, Amit Shah also says book has not been published and should not be raised; Speaker endorses govt view
— Press Trust of India (@PTI_News) February 2, 2026
(Source : Third Party) pic.twitter.com/Zl0Rex9hxZ
Follow Us