Maharashtra: మహారాష్ట్ర సీఎం ఎవరూ ? మరికొన్ని గంటల్లో స్పష్టత

మహారాష్ట్రలో భారీ విజయాన్ని కూడగట్టుకున్న మహాయుతి కూటమిలో ఇప్పుడు సీఎం బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారనేదానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మరో 24 గంటల్లో ముఖ్యమంత్రి ఎవరో తెలిసే ఛాన్స్ ఉంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Fadnavis and shinde

మహారాష్ట్రలో భారీ విజయాన్ని కూడగట్టుకున్న మహాయుతి కూటమిలో ఇప్పుడు సీఎం బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారనేదానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మరో 24 గంటల్లో ముఖ్యమంత్రి ఎవరో తెలిసే ఛాన్స్ ఉంది. ఈ ఎన్నికల్లో 288 సీట్లకు మహాయుతి కూటమి 235 సీట్లు సాధించిన సంగతి తెలిసింది. ఇందులో బీజేపీ 132 స్థానాల్లో గెలిచి ప్రధాన పార్టీగా రికార్డు సృష్టించింది. అధికారం చేపట్టేందుకు 145 మ్యాజిక్‌ ఫిగర్‌ కాగా.. బీజేపీ సింగిల్‌గా దానికి చేరువలో వచ్చింది. అందుకోసమే బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీసే సీఎం అవుతారని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. 

Also Read: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి..ఈ జాగ్రత్తలు తప్పనిసరి మరి

అయితే ఏక్‌నాథ్ షిండేనే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని బీజేపీలోని కొందరు నేతలు సూచిస్తున్నారు. షిండేనే కొంతకాలం సీఎంగా కొనసాగించాలని.. ఫడ్నవీస్‌ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకొచ్చి జేపీ నడ్డా స్థానంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేయాలని మరికొందరు నేతలు సూచిస్తున్నారు. సీఎంగా ఉన్న షిండేను చూపిస్తూ ఎన్నికలకు వెళ్లి ఇప్పుడు గెలిచాక అతడిని పదవి నుంచి తప్పిస్తే బీజేపీ ఇమేజ్‌కు భంగం కలుగుతుందని బీజేపీ సీనియర్ నేత ఒకరు అన్నారు.  

Also Read: మినీ అంగన్‌వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి: కేటీఆర్

అలాగే ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు ప్రజల్లో ఆదరణ పొందాయని.. అతడిని పదవిలో కొనసాగిస్తే కచ్చితంగా బీజేపీ ప్రతిష్ట మరింత పెరుగుతుందని కొందరు నేతలు సూచిస్తున్నారు. అధికారం కోసం బీజేపీ చూడదనే సందేశం ప్రజల్లోకి వెళ్తుందని చెబుతున్నారు. పోలింగ్ రోజున సాయంత్రం షిండే మాట్లాడుతూ సీఎం మార్పు ఉండకపోవచ్చు అని అన్నారు. అలాగే దేవేంద్ర ఫడ్నవీస్‌ కూడా ఈ అంశంపై స్పందించారు. సీఎం పదవి కోసం వివాదాలకు తావివ్వమని.. అందరం కలిసే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. 

Also Read: వివాహిత అపహరణ..బంధీగా ఉంచి 14 రోజులుగా అత్యాచారం!

Also Read: కేసీఆర్ మిత్రుడు, మాజీ ఎమ్మెల్యే కన్నుమూత!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు