Putin: రష్యా సైన్యంలో చేరేవారికి పుతిన్ బంపర్ ఆఫర్.. రష్యా సైన్యంలో చేరేవారికి రుణాలు మాఫీ చేసే చట్టంపై అధ్యక్షుడు పుతిన్ తాజాగా సంతకం చేశారు. ఏడాదిపాటు సైన్యంలో పనిచేసేందుకు వచ్చినవారికి కోటి రూబుల్స్ (రూ.80 లక్షలు) రుణమాఫీ చేసేందుకు ఈ చట్టం వీలు కల్పించనుంది. By B Aravind 25 Nov 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదురుతున్నాయి. ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్దంపై తమ సైన్యాన్ని మరింతగా పెంచుకునేందుకు రష్యా అనేక వ్యూహాలు అనుసరిస్తోంది. తాజాగా మరో అంశాన్ని తీసుకొచ్చింది. రష్యా సైన్యంలో చేరేవారికి రుణాలు మాఫీ చేసే చట్టంపై అధ్యక్షుడు పుతిన్ తాజాగా సంతకం చేశారు. ఏడాదిపాటు సైన్యంలో పనిచేసేందుకు వచ్చినవారికి కోటి రూబుల్స్ (రూ.80 లక్షలు) రుణమాఫీ చేసేందుకు ఈ చట్టం వీలు కల్పించనుంది. Also Read: కొత్త వాహనాలు కొనాలనుకునేవారికి రేవంత్ సర్కార్ బిగ్ షాక్! రుణ వసూలుకు కోర్టు ఉత్తర్వులు జారీ అయి.. ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీలోగా సైన్యంలో చేరేవారికి, వారి జీవిత భాగస్వాముల అప్పులకూ కూడా ఇది వర్తిస్తుంది. ఇప్పటికే పలురకాల ఆర్థిక ప్రోత్సహకాలతో రష్యా ప్రభుత్వం సైన్యంలోకి కొత్తవారిని తీసుకుంటోంది. సగటు జీతం కంటే ఎక్కువగా ఇస్తామని ఆఫర్లు ఇస్తోంది. Also Read: చికెన్ తింటున్నారా? మీకో షాకింగ్ న్యూస్! బలవంతంగా పంపిస్తున్నారు ఇటీవల ఉత్తర కొరియా సేనలు కూడా రష్యా సైన్యానికి తోడయ్యాయి. దీంతో తాజాగా రష్యా.. ఉక్రెయిన్‌పై యుద్ధం చేసేందుకు యెమెన్ వాసులను కూడా తీసుకొచ్చారు. ముందుగా యెమెన్ పౌరులను రష్యాకు తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి బలవంతంగా సైన్యంలోకి తీసుకొని సరిహద్దులకు పంపిస్తున్నారు. ఈ విషయాన్ని అక్కడ పనిచేస్తున్న యెమెన్ వాసులే చెబుతున్నారు. మంచి జీతంతో ఉద్యోగం, రష్యా పౌరసత్వం ఇస్తామంటే ఇక్కడికి వచ్చామని.. చివరికి ఇలా యుద్ధంలో పాల్గొనాల్సి వస్తుందని వాపోతున్నారు. Also Read: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన వీసీ మరోవైపు రష్యా ఉక్రెయిన్ దాడులు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్‌ను బలహీనపరిచేందుకు యూకే దానీ మిత్రదేశాలపై సైబర్ దాడులు చేసేందుకు రష్యా సిద్ధమవుతోంది. నాటో సైబర్ రక్షణ సదస్సులో ఈ హెచ్చరికలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూడో ప్రపంచ యుద్ధం కూడా మొదలైందని ఉక్రెయిన్ మాజీ జనరల్ చెప్పడం కలకలం రేపుతోంది. Also Read: థర్డ్ వరల్డ్ వార్ మొదలైంది–ఉక్రెయిన్ మాజీ జనరల్ #putin #telugu-news #russia #national-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి