Crime: వివాహిత అపహరణ..బంధీగా ఉంచి 14 రోజులుగా అత్యాచారం!

ఒడిశాలోని నవరంగ్‌ పూర్ జిల్లాలో జొరిగావ్‌ సమితికి చెందిన వాసుదేవ్‌ కలార్‌ అనే వ్యక్తి ఓ వివాహితను అపహరించి అత్యాచారం చేశాడు. అంతేకాకుండా ఆమెను 14 రోజులు బంధీగా ఉంచి ఆమెను విక్రయించాలని చూశాడు. ఎలాగో తప్పించుకున్న బాధితురాలు బయటపడింది.

New Update
girl raped

Crime:  దేశంలో ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ఒడిశాలోని నవరంగపూర్‌ జిల్లాలో ఓ వివాహితను అపహరించడమే కాకుండా ఆమె పై  అత్యాచారం చేసి 14 రోజులు బంధించిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆమెను రక్షించిన మాతృ ఆశ్రమ అధ్యక్షురాలు కాదంబని త్రిపాఠి ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలు ప్రకటించారు.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి..ఈ జాగ్రత్తలు తప్పనిసరి మరి

జొరిగావ్‌ సమితికి చెందిన వాసుదేవ్‌ కలార్‌ తనతో శారీరక సంబంధ పెట్టుకోవాలని బాధితురాలిని తరచూ వేధించేవాడు. అందుకు ఆమె నిరాకరించడంతో అక్టోబర్‌ 29న ఒంటరిగా నడిచి వెళ్తున్న క్రమంలో ఆమెను నిందితుడు అపహరించాడు. మొదట కారులో రాయ్‌పూర్‌ కు, అక్కడ నుంచి రైలులో మహారాష్ట్రలోని నాగపూర్‌ కు 170 కిలో మీటర్ల దూరంలోని గంగాపూర్‌ కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

Also Read: ఝార్ఖండ్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న హేమంత్ సోరెన్.. ఎప్పుడంటే ?

అనంతరం ఓ ఇంట్లో 14 రోజులపాటు బంధించి తాళం వేశాడు. కిటికీ లో నుంచి బయట మాటలు విన్న బాధితురాలు తనను అమ్మేసినట్లు తెలుసుకుంది. ఈ నెల 14న ఆ ఇంటి వెనుక గోడ దూకి సుమారు 5 కిలో మీటర్లు నడుచుకుంటూ ఓ కూడలి వద్దకు చేరుకుంది. 

Also Read: ఐపీఎల్‌ మెగావేలం.. ఇప్పటివరకు అమ్ముడుపోయిన ఆటగాళ్ల ఫుల్‌ లిస్ట్‌

భర్తుకు ఫోన్‌ చేసి జరిగిన విషయాన్ని తెలియజేసింది.దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆయన 21న మాతృ ఆశ్రమ అధ్యక్షురాలిని సంప్రదించాడు. దీంతో ఆమె వెంటనే తన బృందాన్ని పంపి బాధితురాలిని రక్షించారు. 

Also Read:Google Maps: విషాదం.. గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్మి ముగ్గురు మృతి

అనంతరం ఉమ్మర్‌ కోట్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంతవరకూ నిందితుడ్ని పోలీసులు పట్టుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

Advertisment
తాజా కథనాలు