/rtv/media/media_files/2024/11/25/BpHzurWNAgk0gMKoYOFA.jpg)
ఉత్తర్‌ప్రదేశ్‌లో జిల్లాలోని సంభల్‌లో ఓ మసీదును(Sambhal Mosque) సర్వే చేస్తుండగా చెలరేగిన అల్లర్లలో నలుగురు వ్యక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 30 మంది పోలీసులు గాయాలపాలయ్యారు. ప్రస్తుతం అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు ముందుజాగ్రత్తగా సంభల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పాఠశాలలను మూసేశారు. పట్టణంలో మొగల్ కాలానికి చెందిన జామా మసీద్ ఉన్న ప్రాంతంలో గతంలో హరిహర మందిరం ఉండేదన్న ఫిర్యాదుతో కోర్టు సర్వే చేయాలని ఆదేశించింది.
Also Read: చికెన్ తింటున్నారా? మీకో షాకింగ్ న్యూస్!
ఈ నేపథ్యంలోనే గత మంగళవారం నుంచి సంభల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆదివారం కొంతమంది వ్యక్తులు సర్వేకు వ్యతిరేకంగా మసీదు ముందు నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. పోలీసులపై రాళ్లు విసిరారు. వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ హింసాత్మక ఘటనలో ముగ్గురు యువకులు మరణించగా.. రాళ్ల దాడిలో సీఐ సహా 15 నుంచి 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి. వీళ్లలో ఓ కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయం కాగా.. డిప్యూటీ కలెక్టర్ కాలు విరిగింది.
Also Read: ప్రారంభమైన శీతాకాలం సమావేశాలు..చర్చకు 17 బిల్లులు
నిరసనాకారుల గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ అది ఫలించలేదు. కొంతమంది దుండగులు ఇళ్ల నుంచి కాల్పులు చేశారు. ప్రస్తుతం పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. సంభల్‌లో 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో పాటు 12వ తరగతి వరకు అన్ని విద్యాలయాలకు సోమవారం సెలవు ప్రకటించారు. ప్రస్తుతం ఇద్దరు ఇద్దరు మహిళలు సహా 21 మందిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
Also Read: మహారాష్ట్ర సీఎం ఎవరూ ? మరికొన్ని గంటల్లో స్పష్టత