Crime News: మృత్యువుతో పోరాడుతూ కాపాడండి అంటూ బీటెక్‌ విద్యార్థిని...

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వాటర్‌ ట్యాంకర్‌ లారీ ఢీకొనడంతో స్కూటర్‌పై వెళుతున్న తండ్రి, కూతురు మృతి చెందారు. మృత్యువుతో పోరాడుతూ అంకుల్‌ కాపాడండి అంటూ మైత్రి చేసిన ఆర్తనాదాలు స్థానికులను కంటతడి పెట్టించాయి.

New Update
btech student accident

btech student accident

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వాటర్‌ ట్యాంకర్‌ లారీ ఢీకొనడంతో స్కూటర్‌పై వెళుతున్న తండ్రి, కూతురు మృతి చెందారు. షాద్‌నగర్‌ సీఐ విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివాసం ఉండే మచ్చేందర్‌.. బీటెక్‌ చదువుతున్న తన కూతురు మైత్రిని శంషాబాద్‌ వర్ధమాన్‌ కళాశాలలో దింపేందుకు  బైక్‌పై బస్టాప్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో షాద్‌నగర్‌ చౌరస్తా వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని వాటర్‌ ట్యాంకర్‌ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మచ్చేందర్‌ ఘటనాస్థలిలోనే మృతి చెందగా, మైత్రికి తీవ్రగాయాలై లారీ టైర్ల మధ్యలో ఇరుక్కు పోయింది. మృత్యువుతో పోరాడుతూ అంకుల్‌ కాపాడండి అంటూ మైత్రి చేసిన ఆర్తనాదాలు స్థానికులను కంటతడి పెట్టించాయి.

Also Read: ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతోంది...సైన్యం కీలక ప్రకటన

Also Read :  TRFను ఉగ్ర సంస్థగా ప్రకటించుకోండి.. పాక్ సంచలన వ్యాఖ్యలు

B.Tech Student Died Of Road Accident

ప్రమాదం జరిగిన వెంటనే తన వద్ద ఉన్న మొబైల్‌ అతి కష్టమ్మీద సమీపంలో ఉన్న ఓ వ్యక్తికి ఇచ్చి కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేయాలని ప్రాథేయపడటం అక్కడి వారి గుండెలు తరుక్కుపోయేలా చేసింది. అదే సమయంలో స్నేహితురాలి నుంచి మైత్రికి ఫోన్లు రావడంతో.. స్థానికులు ఆమెకు ప్రమాదం విషయం చెప్పి ఆమె బంధువులకు సమాచారం అందేలా చేశారు. అయితే చాలా సేపు మృత్యువుతో పోరాడిన మైత్రి కూడా కాసేపటికి కన్నుమూసింది. కాగా ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

Also Read: 18 ఏళ్లకే పైలట్.. సమైరా సక్సెస్ స్టోరీ ఇదే.. మీ పిల్లలకు తప్పక వినిపించండి!

Also Read :  వీర మల్లుకు షాక్.. తొలి రోజు సునామీ.. రెండో రోజు సైలెంట్!

crime news today | crime news telugu | shadnagar-ps | shadnagar | road accident

Advertisment
తాజా కథనాలు