/rtv/media/media_files/2025/05/05/96VrdBiRYHVx8aYQalc1.jpg)
Bigg Boss gets a shock
BIGG BOSS : నాగార్జున హోస్ట్ గా సాగిన బిగ్ బాస్ రియాల్టీ షోకు హైకోర్టు షాక్ ఇచ్చింది. సీపీఐ జాతీయ కార్యదర్శి వేసిన పిటిషన్ పై స్పందించిన హైకోర్టు నాగార్జునతో పాటు నిర్వహకులకు నోటీసులు జారీ చేసింది. ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి, సంస్కృతికి హానికరమని నారాయణ అన్నారు. బిగ్‌బాస్ రియాలిటీ షోపై, హైదరాబాద్‌లో జరగనున్న అందాల పోటీలపై కె. నారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుపతిలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రెండు కార్యక్రమాలు సమాజానికి, సంస్కృతికి హానికరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చూడండి: Trump effect on Tollywood: తెలుగు సినిమాకు ట్రంప్ దెబ్బ.. 7 వేలు దాటనున్న టికెట్ ధరలు!
బిగ్‌బాస్ షో సమాజానికి ఏ మాత్రం ఉపయోగపడని కార్యక్రమమని నారాయణ విమర్శించారు. ఇది యువతను తప్పుదారి పట్టిస్తోందని, కళారంగానికి సైతం కళంకం తెస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. "బిగ్‌బాస్ వ్యవహారం చూస్తే.. చీప్ వ్యభిచారం వద్దు, కాస్ట్లీ వ్యభిచారం చేయండి అన్నట్టుంది" అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. వివాహం కాని వారు ఒకే మంచం మీద పడుకోవడం వంటివి ప్రసారం చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమాన్ని 24 గంటలు ప్రత్యక్ష ప్రసారం చేస్తే ఇంకా దారుణమైన దృశ్యాలు చూడాల్సి వచ్చేదని అన్నారు.
ఇది కూడా చూడండి: VIRAL VIDEO: వెడ్డింగ్ షూట్‌లో విషాదం.. వధువుపై పేలిన బాంబు.. వీడియో వైరల్
బిగ్ బాస్ లో వందరోజుల పాటూ యువతీయువకులను పెద్దగుహలో బంధించి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తారన్నారు.అందులో అక్కా చెల్లెల్లు, ముసలివాళ్లను వేయరని, కేవలం యువతీయువకులనే పంపిస్తారని అన్నారు. అన్ని రకాల సదుపాయాలు కల్పించి యువతీ యువకులను గుహలో వదిలేస్తే ఏం చేయకుండా ఉంటారా అని ప్రశ్నించారు. వంద రోజుల పాటూ గుహలో ఏం చేస్తున్నారనే చర్చ వస్తుందని అన్నారు. ఇలా చెడుతో కూడిన సంస్కృతికి ఎందుకు డబ్బులు పెట్టాలని అన్నారు.
ఇది కూడా చూడండి: Indo-Pak tension: పాకిస్థాన్‌పై దాడి లాంఛనమే.. IAF చీఫ్‌తో ప్రధాని మోదీ
ఇప్పటికే పలుమార్లు బిగ్ బాస్‌ను బ్యాన్ చేయాలని నేను పోలీసులు మొదలుకొని, జిల్లా కోర్టు వరకు అందరి చుట్టూ తిరిగినా రెండేళ్లుగా నా పిటీషన్ స్వీకరించకుండా దండం పెట్టారని, ఎట్టకేలకు హైకోర్టు స్పందించి నేను వేసిన పిటిషన్‌ను స్వీకరించింది అని అన్నారు. ఈక్రమంలో కోర్టు నాగార్జునకు, బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు సైతం జారీ చేసిందని తెలిపారు. ఇప్పటికైనా ఈ షో విషయంలో ప్రజలకు మేలు జరిగేలా, సదరు కార్యక్రమాలు నిర్వహించకుండా తీర్పు వస్తుందని భావిస్తున్నా అన్నారు.
ఇది కూడా చూడండి: Naa Anveshana: యూట్యూబర్ అన్వేష్ అడ్డంగా దొరికేశాడు.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వీడియో వైరల్!
కుటుంబ సాంప్రదాయాల గురించి ప్రపంచానికి భారతదేశం నేర్పిస్తుందని, బిగ్ బాస్ ని చూసి మన దేశం నేర్చుకోవాల్సిన పనిలేదని, అతి పవిత్రమైన భారతీయ సంస్కృతిని నాశనం చేయడానికి బిగ్ బాస్ వచ్చిందన్నారు. ఇక హైదరాబాదులో ఆడవారి అందాల పోటీ పెట్టడం, ఆడవాళ్ళని అందాల సరుకులుగా మార్చడమేన్నారు. పనికిమాలిన వస్తువుల అమ్మకానికి ఆడవాళ్లను ఉపయోగిస్తున్నారని, బిగ్ బాస్ ఎంత హీనమైనదో అందాల పోటీ కూడా అంతే హీనమైనదని ఇవి రెండు మహిళ జాతిని కించపరిచే కార్యక్రమాలని పేర్కొన్నారు. పైగా అందాల పోటీలతో టూరిజం డెవలప్మెంట్ అవుతుందని చెప్పడం అవమానకరంగా ఉందన్నారు.
ఇది కూడా చదవండి: Khammam Digital Arrest: ఖమ్మంలో డిజిటల్ అరెస్ట్ కలకలం.. ఒక్క కాల్ తో రూ.26 లక్షలు ఎలా కొట్టేశారంటే?