/rtv/media/media_files/2025/05/05/pdMlqGlK6zG1R98rfu72.jpg)
Trump tariff decision impact on Telugu cinema
Trump effect on Tollywood: ట్రంప్ తీసుకున్న 100 శాతం టారిఫ్ నిర్ణయం తెలుగు సినిమాపై భారీ ఎఫెక్ట్ చూపనుంది. అమెరికాలో ప్రస్తుతం రూ.3 వేల వరకు ఉన్న టికెట్ ధర దాదాపు రూ.7వేలు కానుంది. టాలీవుడ్‍తో పాటు ఇండియా సినిమాపై ఈ ప్రభావం పడనుంది.
ఫారిన్ సినిమాల ద్వారానే భారీ రెవెన్యూ
అమెరికాలో తెలుగు సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. ఓవర్సీస్ వసూళ్లలో టాలీవుడ్ సినిమాలతో అమెరికాకు భారీగా ఆదాయం సమకూరుతోంది. చిన్న సినిమాల టికెట్ ధర15 డాలర్లు ఉంటే.. పెద్ద హీరోలు ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, చిరంజీవి, తదితుల చిత్రాలలకు 25 నుంచి 35 డాలర్లు డిమాండ్ ఉంటుంది. కానీ ఈ టారిఫ్ కారణంగా 15 డాలర్లు 30, 30 డాలర్ల టికెట్ ధర 70 దాటే అవకాశం ఉంది. ఇదే జరిగితే బయ్యర్స్ అక్కడ సినిమాలను విడుదల చేసుకోలేరు. దీంతో అమెరికాకు కూడా ఆర్ధిక నష్టం తప్పదు. ఎందుకంటే అమెరికా సినీ ఇండస్ట్రీకి ఫారిన్ సినిమాల ద్వారానే భారీ రెవెన్యూ అందుతుంది. ఇటీవల విడుదలైన 'పుష్ప' అమెరికాలో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ చేసింది. నార్త్ అమెరికాలో రెండు రోజుల్లో ఏకంగా 6.03 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త సెన్సేషన్‌గా నిలిచింది. అల్లు అర్జున్ నటించిన సినిమాలకు ఇప్పటివరకు ఇదే అత్యధికం. 'కల్కి 2898 AD' తర్వాత ఉత్తర అమెరికాలో రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా ఇది నిలిచింది. ఎన్టీఆర్ 'దేవర' చిత్రాన్ని కూడా అధిగమించింది.
Also Read: ప్రతీకారం తీర్చుకుంటాం.. ఉగ్రవాదులను చంపుతాం : అమిత్ షా సంచలన కామెంట్స్!
'తెలుగు చిత్రాలపై 100 శాతం టారిఫ్ విధిస్తే టికెట్ రేట్లు భారీగా పెరుగుతాయి. ట్యాక్స్ భారం డిస్ట్రిబ్యూటర్లు భరిస్తే లాభాలు తగ్గుతాయి. యూఎస్ థియేట్రికల్ రైట్స్ వల్ల సినిమాలకు ఆదాయం తగ్గుతుంది. అయితే ఇది కేవలం టాలీవుడ్ కు మాత్రమే క కాదు ఇండియాను సినిమాపై కూడా ప్రభావం ఉంటుంది' అని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సినిమాలపై 100 శాతం సుంకాలు..
ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశాల్లో నిర్మించిన సినిమాలపై 100 శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. వాణిజ్య శాఖ, యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్‌లు తక్షణమే దీనిని ప్రారంభించాలని ఆదేశించారు. హాలీవుడ్‌ను గట్టెక్కించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా ఇండస్ట్రీలు తమ దేశం వెలుపల నిర్మించిన సినిమాలపై 100% పన్ను విధించబడుతుందని తెలిపారు. ఇతర దేశాలు అమెరికన్ స్టూడియోలు, చిత్రనిర్మాతలను విదేశాలకు ఆకర్షించి, లాభదాయకమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నాయని విమర్శించారు. ఈ పరిస్థితి తన ఆర్థిక, జాతీయ భద్రతకు ముప్పుగా పేర్కొన్నారు. ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికన్ చిత్ర పరిశ్రమను పునరుద్ధరించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. వాణిజ్య శాఖ, యుఎస్ వాణిజ్య ప్రతినిధి (యుఎస్టిఆర్) అమెరికా వెలుపల నిర్మించిన అన్ని చిత్రాలపై 100 శాతం సుంకాలు విధించే ప్రక్రియను ప్రారంభించాలని కోరారు.
Also Read: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం
Donald Trump | cinema | tax | telugu-news | today telugu news