Naa Anveshana: యూట్యూబర్ అన్వేష్ అడ్డంగా దొరికేశాడు.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వీడియో వైరల్!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిపై యూట్యూబర్ అన్వేష్ ఉక్కుపాదం మోపాడు. అందరి గుట్టు రట్టు చేశాడు. ఈ నేపథ్యంలో అన్వేష్ పాత వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. అది బెట్టింగ్ వీడియో అంటూ కొందరు నెట్టింట షేర్ చేస్తున్నారు.

New Update
Naa Anveshana

Naa Anveshana

యూట్యూబర్ అన్వేష్ పేరు గత కొద్ది రోజుల నుంచి ఎంతలా మారుమోగుతుందో అందరికీ తెలిసిందే. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వారిపై ఓ రకంగా దండయాత్రే చేస్తున్నాడు. ఎవరెవరైతే బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారో.. వారి గుట్టు రట్టు చేస్తున్నాడు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేసి వారిని అడ్డంగా బుక్ చేస్తున్నాడు. 

Also Read: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం

ఒక్కడిగా మొదలైన అన్వేష్ ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్మూళన యుద్ధానికి పోలీసుల బలం తోడైంది. దీంతో ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు, సినీ స్టార్ల బండారం బట్టబయలైంది. ఎంతో మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. హర్షసాయి, బయ్యా సన్నీ యాదవ్, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, వీఆర్ రాజా, క్రాంతి వ్లాగర్, రీతూ చౌదరి, విష్ణు ప్రియ సహా మరెంతోమంది యూట్యూబర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 

Also Read: ప్రతీకారం తీర్చుకుంటాం.. ఉగ్రవాదులను చంపుతాం : అమిత్ షా సంచలన కామెంట్స్!

వీరితో పాటు మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో మరో 25 మందిపై కేసు నమోదు అయ్యాయి. సినీ ప్రముఖులు రానా దగ్గుపాటు, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచులక్ష్మీ, సురేఖా వాణి కూతురు సుప్రిత, శ్యామల వంటి వారిపై కూడా కేసులు పెట్టారు. ఇలా అన్వేష్ ఎవ్వరినీ వదల్లేదు. ప్రతీ ఒక్కరినీ వేటాడి.. వారి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వీడియోలు బయటపెట్టి ఇరికించాడు. 

అన్వేష్ పై కేసు

ఇదే క్రమంలో అన్వేష్ పై హైదరాబాద్‌లో పోలీస్ కేసు నమోదైంది. డీజీపీ, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితోపాటు పలువురిపై అన్వేష్ సంచలన ఆరోపణలు చేశాడు. వందల కోట్లు కొట్టేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నాడని సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది.

Also Read :  దేశంలోని మొట్టమొదటి AI- ఆధారిత డేటా సెంటర్ పార్క్

అన్వేష్ పాత వీడియో వైరల్

దీంతో అన్వేష్‌పై చాలా మంది యూట్యూబర్లు పట్టరాని కోపంతో ఉన్నట్లు నెట్టింట ప్రచారం జరిగింది. అన్వేష్ ఎప్పుడెప్పుడు దొరుకుతాడా? అని కొందరు యూట్యూబర్లు ఎదురుచూస్తున్నట్లు జోరుగా ప్రచారం నడిచింది. ఈ క్రమంలో అన్వేష్ పాత వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో అన్వేష్ ఏదో విషయాన్ని ప్రమోట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. దీంతో కొందరు ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. అన్వేష్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వీడియో అంటూ షేర్లు చేస్తున్నారు. ఆ వీడియోలో అన్వేష్ మాట్లాడుతూ.. ‘‘అందరూ సరదాగా చెప్తారు అనుకుంటున్నారా? అది నొక్కండి ఇది నొక్కండి అని.. దానికి కమీషన్ వస్తుంది. 

Also Read :  కాలేజ్ కుర్రాళ్ల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్!

అయితే దానివల్ల మీకేం నష్టం ఉండదు. మేము ప్రమోట్ చేస్తుంటాం. దానికి మాకు కొంచెం మనీ ఇస్తారు. మీకేం నష్టం ఉండదు. నేను వాటికి సంబంధించి అన్ని విషయాలు చెప్తాను. ఇక నుంచి నేను ప్రమోషన్ వీడియోలు కాస్త చేసే అవకాశం ఉంటుంది.’’ అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. దీంతో చాలా మంది ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. అన్వేష్ నాలుగు సంవత్సరాల క్రితం బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ అంటూ దానికి క్యాప్షన్ ఇస్తున్నారు. దీనిపై అన్వేష్ స్పందించి క్లారిటీ ఇస్తాడా? లేదా? అనేది చూడాలి.  

naa anveshana | Case On Naa Anveshana | Naa Anveshana Betting Scams | naa anveshana videos | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు