/rtv/media/media_files/2025/05/05/vnnoV04rrfJOwgP5ZyOJ.jpg)
Amid rising Indo-Pak tension, IAF Chief meets PM Modi in Delhi
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఇప్పటికే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణమైన పాక్‌పై భారత సైన్యం దాడులు చేయొచ్చనే ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ మరోసారి కీలక భేటీ నిర్వహించారు. ఆదివారం ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) చీఫ్ అమర్ ప్రీత్ సింగ్‌తో సమావేశమయ్యారు. ప్రస్తుతం పాకిస్థాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, భద్రతా పరిస్థితిపై చర్చించినట్లు సమాచారం.
అలాగే పాకిస్థాన్‌పై చర్యలు తీసుకునే విషయంలో ఎలాంటి వ్యూహాత్మక విధానాలు అనుసరించాలో మాట్లాడినట్లు తెలుస్తోంది. పహల్గాగం ఘటన జరిగిన తర్వాత ఇప్పటికే ప్రధాని మోదీ భారత ఆర్మీకి పూర్తి అధికారాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్.. ప్రధానితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: ‘ఈసీఐనెట్’.. ఎన్నికల కమీషన్ సంచలన నిర్ణయం.. సేవలన్నింటికీ ఒకే యాప్!
భారత నావీ చీఫ్ అడ్మైరల్ దినేష్ ప్రధాని మోదీతో సమావేశం అయిన 24 గంటల్లోనే ఐఏఎఫ్ చీఫ్‌తో సమావేశం జరిగింది. ఈ భేటికి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాట్ జనరల్ అనిల్ చౌహన్, అలాగే ఇతర చీఫ్‌లు కూడా హాజరయ్యారు. ప్రధాని వరుస భేటీల నేపథ్యంలో పాకిస్థాన్‌పై చర్యలకు దిగేందుకు భారత్ ఏదైనా బిగ్ ప్లాన్ చేస్తోందనే ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీతో పాటు, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్.. ఉగ్రదాడికి పాల్పడ్డవారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. దీంతో పాకిస్థాన్‌పై ఏ క్షణమైన దాడులు జరగొచ్చనే ప్రచారం నడుస్తోంది. మొత్తానికి భారత్ బలమైన దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దాయాది కోలుకోకుండా చేసేందుకు త్రివిధ దళాలు ఇప్పటికే బ్లూప్రింట్ రెడీ చేసినట్లు సమాచారం.
Also Read: కాళ్ల బేరానికి దిగిన పాకిస్తాన్.. ఐక్యరాజ్య సమితి ఎమర్జెన్సీ మీటింగ్
భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని గగన వీధుల్లో IAFకు చెందిన నాలుగు రాఫెల్ యుద్ధ విమానాలు పెట్రోలింగ్ నిర్వహించాయి. అయితే ఈ రాఫెల్ యుద్ధ విమానాలను గమనించిన పాక్ ఆర్మీ.. వెంటనే అలర్ట్ అయి వాటిని వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. కానీ అవి లైన్ ఆఫ్ కంట్రోల్‌ను (LOC) దాటనట్లు వార్తలు వచ్చాయి. ఇదిలాఉండగా ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ దాడి తర్వాత భారత్ పాక్‌పై సంచలన నిర్ణయాలు తీసుకుంది. సింధు నది జలాల ఒప్పందం నిలిపివేయడం, సరిహద్దు మూసివేయడం, భారత్‌లో ఉన్న పాకిస్థానీయులను తరలించడం, పాక్ విమానాలు భారత గగనతలంలోకి రాకుండా నిషేధించడం లాంటి నిర్ణయాలు తీసుకుంది.
rtv-news | india pakistan tension | national-news