Chhattisgarh Encounter: మావోయిస్టులకు బిగ్ షాక్‌..ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు అగ్రనేతలు?

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో నవంబర్ 11న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఆరుగురు నక్సలైట్లలో ఇద్దరు సీనియర్‌ నాయకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిలో సీనియర్‌ నేత పాపా రావు భార్య ఉర్మిళ, మరో నాయకుడు బుచ్చన్న ఉన్నట్లు అధికారులు దృవీకరించారు.

New Update
FotoJet (85)

Big shock for Maoists..Two top leaders killed in Chhattisgarh encounter?

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో నవంబర్ 11న భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌(chhattisgarh maoist encounter)లో మరణించిన ఆరుగురు నక్సలైట్లలో ఇద్దరు సీనియర్‌ నాయకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిలో  సీనియర్‌ నేత పాపా రావు భార్య ఉర్మిళ, మరో నాయకుడు బుచ్చన్న కుడియామ్ కూడా ఉన్నారని పోలీసు అధికార్లు దృవీకరించారు. ఇంద్రావతి జాతీయ ఉద్యానవనం ప్రాంతంలోని మారుమూల ప్రాంతం కందుల్నార్, కాచ్లారామ్ గ్రామాల సమీప అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సల్స్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిపై మొత్తం రూ. 27 లక్షల రివార్డు ఉన్నట్లు బీజాపూర్ పోలీసు(bijapur naxal encounter) సూపరింటెండెంట్ జితేంద్ర యాదవ్ విలేకరుల సమావేశంలో తెలిపారు.

Also Read: Delhi Blast: ఢిల్లీ బ్లాస్ట్ లో సంచలన విషయాలు..పేలుళ్లలో మహిళా ఉగ్రవాదుల పాత్ర

Chhattisgarh Encounter

గత దశాబ్ద కాలంలో జరిగిన అనేక ప్రధాన నక్సలైట్ దాడుల వెనుక బుచ్చన్న అలియాస్ కన్నా (35) ప్రధాన సూత్రధారి కాగా, ఊర్మిళ మావోయిస్టుల PLGA (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) బెటాలియన్‌కు లాజిస్టికల్ సామాగ్రిని సరఫరా చేసే ప్రధాన నిర్వాహకురాలుగా పోలీసులు తెలిపారు. స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు (SZCM) అయిన పాపా రావు, ఆయన భార్య , డివిజనల్ కమిటీ సభ్యురాలు (DVCM) ఊర్మిళ, DVCM, మాడ్డ్ ఏరియా కమిటీ ఇన్‌ఛార్జ్ కన్న అలియాస్ బుచ్చన్న , DVCM మోహన్ కడ్తితో పాటు 50--60 మంది దళంతో కలసి అటవీ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందటంతో  బీజాపూర్, దంతెవాడ నుండి డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) ,స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) సిబ్బందితో దాడులు నిర్వహించారు.

Also Read: మొత్తం విప్పేసి.. డబుల్ ఇస్మార్ట్ బ్యూటీ హాట్ షో అందాలు.. ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే!

కాగా ఈ కాల్పుల్లో ఊర్మిళ, బుచ్చన్నలతో పాటు మరో నలుగురు నక్సల్స్‌ మృతి చెందారు, ఇతర సీనియర్ నాయకులు తప్పించుకున్నారు. మరణించిన మరో నలుగురు ఏరియా కమిటీ సభ్యులలో జగత్ తమో అలియాస్ తమోగా గుర్తించారు, వీరికి రూ. 5 లక్షల రివార్డు, ప్లాటూన్ సభ్యులు దేవే, భగత్ , మంగ్లీ ఓయం ఒక్కొక్కరికి రూ. 2 లక్షల రివార్డులు ఉన్నట్లు ప్రకటించారు.బుచ్చన్నపై బీజాపూర్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో అతనిపై 42 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి,18 అరెస్ట్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి" అని పోలీసులు తెలిపారు.

సంఘటనా స్థలం నుండి ఐదు మ్యాగజైన్‌లతో కూడిన రెండు INSAS రైఫిల్స్ (68 రౌండ్లు), మూడు మ్యాగజైన్‌లతో కూడిన ఒక 9mm కార్బైన్ (22 రౌండ్లు), ఒక మ్యాగజైన్‌తో కూడిన ఒక .303 రైఫిల్ (13 రౌండ్లు), ఒక సింగిల్-షాట్ రైఫిల్, ఒక 12-బోర్ గన్ (8 రౌండ్లు), రేడియో సెట్లు, స్కానర్లు, మల్టీమీటర్లు, హ్యాండ్ గ్రెనేడ్‌లు, సేఫ్టీ ఫ్యూజ్‌లు, పేలుడు పదార్థాలు, మావోయిస్టు సాహిత్యం, యూనిఫాంలు, వైద్య సామాగ్రి , ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. 

Also Read: మొత్తం విప్పేసి.. డబుల్ ఇస్మార్ట్ బ్యూటీ హాట్ షో అందాలు.. ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే!

Advertisment
తాజా కథనాలు