/rtv/media/media_files/2025/09/15/bengaluru-2025-09-15-18-47-25.jpg)
Bengaluru couple attempt suicide after killing 2 children, wife survives
కర్ణాటక(Karnataka) లో దారుణం జరిగింది. ఆర్థిక సమస్యలు(Financial Issues) తట్టుకోలేక భార్యభర్తలు తమ ఇద్దరు పిల్లలను గొంతు నులిమి హత్య చేయడం కలకలం రేపింది. ఆ తర్వాత వాళ్లు కూడా సూసైడ్ చేసుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో భర్త మృతి చెందాడు. భార్య ప్రాణాలతో బయటపడింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. హోస్‌కోట్ జిల్లా గోనకనహళ్లిలో శివకుమార్ (32), మంజుల దంపతులకు 11 ఏళ్ల కుమార్తె, ఏడేళ్ల కొడుకు ఉన్నారు. కొంతకాలం క్రితం శివకుమార్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో శివకుమార్ కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అతడు ఇంటికే పరిమితమయ్యాడు.
Also Read: భర్త ట్రిపుల్ తలాక్.. కోర్టు ముందే భర్తను చెప్పుతో చితకబాదిన భార్య: వీడియో వైరల్
Bengaluru Couple Attempt Suicide
అప్పటి నుంచి భార్య మంజుల (30) చిన్నచిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. వైద్యం కోసం అప్పులు చేసింది. దీంతో ఆర్థిక సమస్యలు పెరిగిపోయాయి. చివరికి దంపతులు ఆత్మహత్య(Couple Suicide) చేసుకోవాలనుకున్నారు. ఒకవేళ తాము సూసైడ్ చేసుకుంటే పిల్లలు అనాథలు అవుతారని భావించారు. దీంతో ముందుగా పిల్లలను హత్య చేసి తర్వాత వారు చనిపోవాలని అనుకున్నారు. ప్లాన్ ప్రకారం ముందుగా కొడుకు, కూతురు గొంతునులిమి హత్య చేశారు.
Also Read: సమానత్వం ఉంటే ఎందుకు మతం మారుతారు.. సీఎం సంచలన కామెంట్స్
సూసైడ్ చేసుకునేముందు తనకు మద్యం తాగాలని ఉందని అందులోకి స్నాక్స్ కూడా తీసుకురావాలని శివకుమార్ భార్యను అడిగాడు. అలాగే అతని భార్య మంజుల కూడా చివరిసారిగా తన పుట్టింటి వాళ్లని చూడాలని ఉందని చెప్పింది. దీనికి శివ కూడా అంగీకరించాడు. మంజుల స్థానికంగా ఉన్న తన పుట్టింటికి వెళ్లి స్నాక్స్ తీసుకొచ్చే లోపే శివకుమార్ ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు.
ఆ తర్వాత మంజుల కూడా సూసైడ్ చేసుకునేందుకు యత్నించింది. కానీ ఆమెను స్థానికులు గమనించి రక్షించారు. ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆమె ప్రాణాలతో సురక్షితంగా బయటపడింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి వచ్చారు. విచారణలో మంజుల కూడా పొంతన లేని మాటలు చెప్పింది. ఆమెపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు హత్యా కేసు నమోదు చేశారు. భర్త, పిల్లలను ఆమెనే హత్య చేసి ఉంటుందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
Also Read: ఆఫీసులో వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య.. కంపెనీకి రూ.90 కోట్ల జరిమానా