/rtv/media/media_files/2025/09/15/woman-dies-by-suicide-2025-09-15-16-20-50.jpg)
Woman dies by suicide after verbal abuse at work, family gets 90 crores compensation
జపాన్(Japan) లో దారుణం జరిగింది. ఆఫీసులో వేధింపులు(Abuse) ఎదుర్కొన్న ఓ ఉద్యోగిని(employee) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. దీనిపై విచారణ జరిపిన అక్కడి న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. రూ.90 కోట్ల పరిహారం చెల్లించాలంటూ యజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. టోక్యోకు చెందిన కాస్మోటిక్స్ బ్రాండ్ డియూపీ కార్పొరేషన్ సంస్థలో సటోమి(25) అనే యువతి 2021 ఏప్రిల్ ఉద్యోగంలో చేరింది.
Also Read: జాబ్ ఇస్తానని నమ్మించి ఇరాన్‌లో భారతీయుడికి చిత్రహింసలు.. చివరికి
Woman Dies By Suicide After Verbal Abuse At Work
ఈ ఏడాది డిసెంబర్‌లో ఓ మీటింగ్ జరిగింది. అందులో ఆ కంపెనీ ప్రెసిడెంట్ మిత్సురు సకై అనే వ్యక్తి.. ఆమెను ఘోరంగా తిట్టారు. ముందస్తు పర్మిషన్ లేకుండా క్లయింట్లను కలిసినందుకు ఆమెపై మండిపడ్డారు. అంతేకాదు ఆమెను వీధి కుక్క అని అవమానించాడని.. కంపెనీ రూల్స్ పాటించలేదని తిట్టారని పలు మీడియా కథనాలు తెలిపాయి. అలాగే తర్వాతి రోజు కూడా ఆమెను పరుష పదజాలంతో తిట్టి అవమానపర్చారని దీనివల్ల ఆ యువతి మానసిక వేధనకు గురైనట్లు పేర్కొన్నాయి.
Also Read: ఈ అనుమానంతోనే లండన్‌లో నిరసనలు.. బ్రిటన్‌ని కదిలించిన ముగ్గురు పిల్లల చావు
డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన ఆమె చికిత్స కోసం కొన్నిరోజుల పాటు లీవ్ తీసుకుంది. అయినప్పటికీ ఆమె పరిస్థితి రోజురోజుకు దిగజారిపోయింది. 2022లో ఆగస్టులో ఆమె సూసైట్ అటెంప్ట్ కూడా చేసింది. చివరికి కోమాలోకి వెళ్లిపోయి 2023 అక్టోబర్‌లో మృతి చెందింది. ఈ ఘటన తర్వాత బాధితురాలి తల్లిదండ్రులు కోర్టుకి వెళ్లారు. కాస్మోటిక్స్ కంపెనీతో సహా ఆ ప్రెసిడెంట్‌పై కేసు పెట్టారు. చివరికి ఇది ఆఫీసులో జరిగిన ప్రమాదంగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే తాజాగా టోక్యో జిల్లా కోర్టు కీలక తీర్పునిచ్చింది.
Woman in Japan, 25, died by suicide after being verbally abused at work. Family receives S$1.3 million in compensation. https://t.co/yYHoxrWtZlpic.twitter.com/XGChw3ZVde
— Mothership (@MothershipSG) September 14, 2025
Also Read: భారతీయుడి తల నరకడంపై ట్రంప్ రియాక్షన్ ఇదే.. ‘టైం దగ్గర పడింది’
ఆ ఉద్యోగిని మృతికి కంపెనీ, ప్రెసిడెంట్ బాధ్యులని వెల్లడించింది. దీంతో కంపెనీ యాజమాన్యం బాధిత కుటుంబానికి 150 మిలియన్ యెన్లు(రూ.90 కోట్లు) పరిహారం చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు మిత్సురు సకై వెంటనే పదవి నుంచి దిగిపోవాలంటూ ఆదేశించాయి. చివరికి సకై తన పదవికి రాజీనామా చేయగా.. కంపెనీ కూడా బహిరంగ క్షమాపణలు చెప్పింది. తమ కంపెనీ రూల్స్‌ను సమీక్షిస్తామని.. ఇంకా మెరుగుపర్చుకుంటామని పేర్కొంది.
Also Read: భర్త ట్రిపుల్ తలాక్.. కోర్టు ముందే భర్తను చెప్పుతో చితకబాదిన భార్య: వీడియో వైరల్