CM Siddaramaiah: సమానత్వం ఉంటే ఎందుకు మతం మారుతారు.. సీఎం సంచలన కామెంట్స్

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. మన హిందూ సమాజంలో సమానత్వం ఉంటే, ఎవరైనా ఎందుకు మతం మారుతారు అని ఆయన ప్రశ్నించారు. మానత్వం ఉంటే, అంటరానితనం ఎందుకు వచ్చింది?

New Update
cm siddaramaiah

కర్ణాటక(karnataka) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(CM Siddaramaiah) మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. మన హిందూ సమాజంలో సమానత్వం ఉంటే, ఎవరైనా ఎందుకు మతం మారుతారు అని ఆయన ప్రశ్నించారు. మానత్వం ఉంటే, అంటరానితనం ఎందుకు వచ్చింది? మనం అంటరానితనాన్ని సృష్టించామా? అని ప్రశ్నించారు.  ఇస్లాం, క్రైస్తవ మతం లేదా ఏ మతంలోనైనా అసమానతలు ఉండవచ్చు. తాము లేదా బీజేపీ ఎవరినీ మతం మారమని అడగలేదు, కానీ ప్రజలు మతం మారుతారు అది వారి హక్కు అని సిద్ధరామయ్య కామెంట్స్ చేశారు. కుల సర్వే గురించి జరుగుతున్న చర్చలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  

Also Read :  కంటెంట్‌ క్రియేటర్లకు అలెర్ట్.. పార్లమెంటరీ సంఘం కీలక నిర్ణయం

ముస్లింలను ప్రశ్నించే ధైర్యం మీకు ఉందా?

ఆయన కామెంట్స్ పై బీజేపీ(bjp) ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక కూడా విమర్శలు కురిపించారు. సమానత్వంపై ముస్లింలను ప్రశ్నించే ధైర్యం మీకు ఉందా? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ఇతర మతాలైన ఇస్లాం, క్రైస్తవ మతాలలో కూడా అసమానతలు ఉన్నాయని, ముఖ్యమంత్రి కేవలం హిందూ మతాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం సరికాదని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. ఒకవైపు హిందూ సమాజంలో ఉన్న అసమానతలను సిద్ధరామయ్య ఎత్తి చూపారని కాంగ్రెస్ నాయకులు సమర్థిస్తుండగా, మరోవైపు బీజేపీ నాయకులు హిందూ వ్యతిరేక వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ వివాదం కర్ణాటక రాజకీయాల్లో మరింత వేడిని పెంచింది.

Also Read :  భర్త ట్రిపుల్ తలాక్.. కోర్టు ముందే భర్తను చెప్పుతో చితకబాదిన భార్య: వీడియో వైరల్

Advertisment
తాజా కథనాలు