UP: పాపం పెళ్లి కొడుకు.. బంగారం, రూ.3.5 లక్షలతో పెళ్లి కూతురు జంప్.. ఎక్కడంటే..!?

యూపీలోని మహారాజ్‌గంజ్‌ జిల్లాల్లో ఓ కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కుటుంబానికి పెద్ద షాకిచ్చింది. పెళ్లి అయిన రాత్రే వరుడి కుటుంబం విందు ఏర్పాట్లలో ఉండగా..కొత్త పెళ్లి కూతురు 3.5 లక్షల విలువైన నగలతో పారిపోయింది.

New Update
Karthika masam: ఎంత ట్రై చేసినా పెళ్లి కావడం లేదా..అయితే కార్తీక మాసం లో ఇలా చేయండి మరీ!

up

యూపీలోని మహారాజ్‌గంజ్‌ జిల్లాల్లో ఓ షాకింగ్‌ విషయం వెలుగు చూసింది. ఓ నవ వధువు పెళ్లైన కొన్ని గంటలకే వరుడి కుటుంబానికి పెద్ద షాకిచ్చింది. రాత్రికి రాత్రే లక్షల విలువైన నగలతో పారిపోయింది. దీంతో ఏం చేయాలో తెలియని వరుడి కుటుంబం ప్రస్తుతం పోలీస్‌ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువతి కోసం వెదకడం ప్రారంభించారు. 

Also Read: US Rains: అమెరికాలో అల్లకల్లోలం.. భారీ వర్షాలు, వరదలతో 9 మంది మృతి.. ట్రంప్ కీలక ఆదేశాలు!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాజ్‌గంజ్‌ లోని ఘుగ్లి పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతంలోని రాంపూర్‌ బల్దిహాకు చెందిన మనీష్‌ అనే యువకుడికి ఫిబ్రవరి 7న  కోతిబహార్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని  వివాహం చేసుకున్నాడు. ఫిబ్రవరి 10న వధువు తన అత్తమామల ఇంటికి వచ్చింది. ఇంట్లో బంధువులు ఎక్కువగా ఉండడం వల్ల వరుడి కుటుంబ సభ్యులందరూ తమ నగలను వధువు గదిలో ఉంచారు.

Also Read: Bihar Earthquake: బాబోయ్ భూకంపం.. ఢిల్లీతో పాటు బీహార్‌లో కూడా: ఇళ్లలోంచి పరుగే పరుగు!

 పెళ్లి కొడుకు సోదరి నగలు కూడా...

మరి ఏం బుద్ధి పుట్టిందో ఏమో..రాత్రికి రాత్రే తన నగలతో పాటు..పెళ్లి కొడుకు సోదరి నగలు కూడా పట్టుకుని పెళ్లికూతురు పారిపోయింది.విషయం తెలుసుకున్న వరుడు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 11 వ తేదీ రాత్రి కుటుంబ సభ్యులు,బంధువులు విందు ఏర్పాట్లలో ఉన్న సమయంలో పెళ్లి కూతురు నగలతో పారిపోయిందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతేకాకుండా రాత్రంతా వధువు కోసం వెతికినప్పటికీ ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వధువు  తల్లిదండ్రులకు కూడా ఆమె గురించి తెలియదని అంటున్నారు.కానీ వరుడు మాత్రం ఈ సంఘటనలో వధువు కుటుంబం ప్రమేయం ఉందని ఆరోపించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. 

Also Read: KUMBH MELA 2025: కుంభమేళా ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఏపీ, తెలంగాణ నుంచి స్పెషల్ ట్రైన్స్: లిస్ట్ ఇదే!

Also Read: America-Bharat: తీరు మార్చుకోని అగ్రరాజ్యం..మరోసారి సంకెళ్లతోనే వారిని భారత్ కు పంపిన వైనం!

Advertisment
Advertisment
తాజా కథనాలు