UP Crime: అలహాబాద్ ఐఐఐటీలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య!
తెలంగాణకు చెందిన ఐఐఐటీ మొదటి సంవత్సరం విద్యార్థి రాహుల్ అలహాబాద్ క్యాంపస్ లో ఆత్మహత్య చేసుకున్నాడు.పరీక్షలో విఫలం చెందడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
తెలంగాణకు చెందిన ఐఐఐటీ మొదటి సంవత్సరం విద్యార్థి రాహుల్ అలహాబాద్ క్యాంపస్ లో ఆత్మహత్య చేసుకున్నాడు.పరీక్షలో విఫలం చెందడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
యూపీ దుబౌలియా పోలీస్ స్టేషన్ లో ఘోరం జరిగింది. ఉభాయ్ గ్రామానికి చెందిన ఆదర్శ్ ఉపాధ్యాయ్ అనే మైనర్ బాలుడిని దాడి ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఆదర్శ్ చనిపోవడంతో స్టేషన్ ఇంచార్జ్, ఎస్సై, కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు.
యూపీలో భర్తల గుండెపగిలే సంఘటన జరిగింది. పెళ్లైన 15 రోజులకే ప్రగతి అనే నవ వధువు భర్త దిలీప్‌ను లేపేసింది. ప్రియుడికోసం పెళ్లికి బహుమతిగా వచ్చిన రూ.2 లక్షలు సుపారి ఇచ్చి చంపించింది. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
యూపీలో డబుల్ మర్డర్ కేసు సంచలనం రేపింది. కాకోరికి చెందిన కానిస్టేబుల్ మహేంద్ర.. తన భార్య దీపికతో అక్రమ సంబంధం పెట్టుకున్న మనోజ్‌ను ఇంటికి పిలిపించి గొంతుకోసి చంపాడు. మనోజ్ ఫ్రెండ్ ను మణికట్టు కోసి హతమార్చాడు. మహేంద్ర, దీపికను పోలీసులు అరెస్ట్ చేశారు.
యూపీ ఆగ్రాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు మోటార్ సైకిళ్ళు ఢీకొని ఐదుగురు దుర్మరణం చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వారంతా సైయన్ ప్రాంత నివాసితులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ రాజ్వీర్ సింగ్ తెలిపారు.
యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లాల్లో ఓ కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కుటుంబానికి పెద్ద షాకిచ్చింది. పెళ్లి అయిన రాత్రే వరుడి కుటుంబం విందు ఏర్పాట్లలో ఉండగా..కొత్త పెళ్లి కూతురు 3.5 లక్షల విలువైన నగలతో పారిపోయింది.
కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ, జయా బచ్చన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.మరణించిన వారి మృతదేహాలను నదిలో పడేశారని ఆరోపించారు.దీంతో కుంభమేళా నీరు కలుషితమైందని విమర్శించారు
సీతాపుర్ కాంగ్రెస్ ఎంపీ రాకేశ్ రాథోడ్ అరెస్టు అయ్యారు. అత్యాచార ఆరోపణలపై కేసు నమోదు కావడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన ఇంటిముందు మీడియాతో మాట్లాడుతుండగానే అరెస్టు చేసి భారీ భద్రత నడుమ కోర్టుకు తీసుకెళ్లారు.
ఉత్తరప్రదేశ్‌లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మీరట్‌లో కలకలం రేపుతోంది. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులతో సహా తల్లిదండ్రులను హతమార్చి మృతదేహాలను గోనె సంచిలో దాచి పెట్టారు.