US Rains: అమెరికాలో అల్లకల్లోలం.. భారీ వర్షాలు, వరదలతో 9 మంది మృతి.. ట్రంప్ కీలక ఆదేశాలు!

అగ్ర రాజ్యం అమెరికాను భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీ తుఫాన్లు కారణంగా వరదలు ముంచెత్తాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. వరదలు కారణంగా ఇప్పటి వరకు 9 మంది చనిపోయారు. దాదాపు 39,000 ఇళ్లల్లో విద్యుత్ నిలిచిపోయింది. 

New Update
america

america

America: అగ్ర రాజ్యం అమెరికాను భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీ తుఫాన్లు కారణంగా వరదలు ముంచెత్తాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. భారీగా గాలులు వీచడంతో ఆస్తులు ధ్వంసమయ్యాయి. దీంతో అత్యధికంగా కెంటుకీలో ప్రాణనష్టం జరిగింది. వరదలు కారణంగా ఇప్పటి వరకు 9 మంది చనిపోయారు. కార్లు నీటిలో చిక్కుకుని మునిగిపోవడంతో ప్రాణాలు పోయాయి. అంతేకాకుండా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 39,000 ఇళ్లల్లో విద్యుత్ నిలిచిపోయింది. 

Also Read: Canada: అవసరమైతే ఉక్రెయిన్‌ కి మా బలగాలు పంపుతాం: కెనడా ప్రధాని!

దీంతో అంధకారం అలుముకుంది. పరిస్థితి మరింత దిగజారే అవకాశాలున్నాయని కెంటుకీ గవర్నర్ చెప్పారు.వరదలు కారణంగా ప్రాణనష్టం జరగడం విషాదకరమని కెంటుకీ గవర్నర్ ఆండీ బెషీర్ అన్నారు. ఇక వరదల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించాల్సి ఉందన్నారు. ఇక సహాయక చర్యలను సమన్వయం చేయడానికి ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీకి అధికారం అందజేశారు.

Also Read: Gold Prices: బంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త...వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు!

కారు నీటిలో చిక్కుకోవడంతో...

ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వరదలపై సమీక్షిస్తున్నారు.ఏడేళ్ల బిడ్డతో సహా తల్లి కారు నీటిలో చిక్కుకోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రజలెవరూ రోడ్లపైకి రావొద్దని గవర్నర్ కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ బెషీర్ తెలిపారు. కెంటుకీ, టేనస్సీలోని కొన్ని ప్రాంతాల్లో 15 సెంటీమీటర్ల వర్షం కురిసిందని నేషనల్ వెదర్ సర్వీస్ సీనియర్ ఫోర్కాస్టర్ బాబ్ ఒరావెక్ తెలిపారు. భారీ వరదలు కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

Also Read: Telangana: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌..నేడు సెలవు ప్రకటించిన సర్కార్‌!

Also Read: Telangana Crime: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం బావనే హతమార్చిన బావమరిది!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు